సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By
Last Updated : శుక్రవారం, 1 మార్చి 2019 (17:27 IST)

పాకిస్థాన్ పత్రికలో ప్రముఖంగా పవన్ వ్యాఖ్యలు

భారత్ పాకిస్థాన్ దేశాల మధ్య నెలకొన్న తాజా పరిణామాలపై జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు పాకిస్థాన్‌కు చెందిన ప్రముఖ పత్రిక "డాన్"  పత్రిక వెబ్‌సైట్‌లో ప్రముఖంగా ప్రచురించింది. ఇరు దేశాల మధ్య యుద్ధ వాతావరణం నెలకొనడంతో పవన్ వ్యాఖ్యలను ఆ పత్రిక ప్రధానంగా ప్రస్తావించింది. 
 
భారత సార్వత్రిక ఎన్నికలకు ముందు యుద్ధం (పాక్‌తో) జరుగుతుందని బీజేపీ తనకు రెండేళ్ళ కిందటే చెప్పినట్లు పవన్ కళ్యాణ్ ఇటీవల వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలపై రాష్ట్ర వ్యాప్తంగా చర్చ జరిగింది. ఈ వ్యాఖ్యలను పాకిస్థాన్‌లోని ప్రముఖ మీడియా సంస్థ "డాన్" తన వెబ్‌సైట్‌లో ప్రధానంగా ప్రస్తావించింది. ఇందుకు సంబంధించి క్లుప్తంగా సమాచారం ఇస్తూ మనదేశానికి చెందిన ఒక ఇంగ్లీష్ వెబ్‌సైట్‌లో వచ్చిన కథనాన్ని లింక్ చేసింది.
 
పవన్ వ్యాఖ్యలు ఇవేనంటూ డాన్ వెబ్‌సైట్ వాటిని ప్రత్యేకంగా హైలైట్ చేసింది... 'యుద్ధం వస్తుందని నాకు రెండేళ్ళ కిందటే చెప్పారు. దీన్ని బట్టి మన దేశంలో ఎలాంటి పరిస్థితి ఉందన్నది అర్థం చేసుకోవచ్చు' అని పవన్ కళ్యాణ్ ఆ ట్వీట్‌లో పేర్కొన్నారు.