1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరోనా
  4. 21,452 new cases of coronavirus in AP

ఏపీలో కళ్లెం లేని కరోనా, కొత్తగా 21,452 కేసులు

21
అమరావతి: గత 24 గంటల్లో ఆంధ్రప్రదేశ్‌లో 90,750 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా 21,452 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్థారణ అయ్యింది. ఇప్పటివరకు రాష్ట్రంలో 13,44,386 మందికి కరోనా వైరస్‌ సోకింది.

నిన్న ఒక్కరోజే కరోనా బారిన పడి 89 మంది మృత్యువాతపడ్డారు. దీంతో మొత్తం మరణాల సంఖ్య 8,988కు చేరింది. గడిచిన 24 గంటల్లో 19,095 మంది కోవిడ్‌ నుంచి కోలుకుని క్షేమంగా డిశ్చార్జ్‌ అవ్వగా, ఇప్పటివరకు 11 లక్షల 35 వేల 133 మంది డిశ్చార్జ్‌ అయ్యారు.

ఈ మేరకు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ బుధవారం కరోనాపై హెల్త్‌ బులెటిన్‌ విడుదల చేసింది. ఏపీలో ప్రస్తుతం 1,97,370 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. రాష్ట్రంలో నేటి వరకు 1,76,05,687 కరోనా నిర్థారణ పరీక్షలు నిర్వహించారు.
About Writer
ఎం
తర్వాతి కథనం
పదోతరగతి విద్యార్థులను పాస్‌ చేస్తూ తెలంగాణ ప్రభుత్వం జీవో