1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరోనా
  4. Andhra Pradesh : Corona Positive Cases near 2K Cases

ఆంధ్రాలో కరోనా : 2 వేలకు చేరువలో పాజిటివ్ కేసులు

Andhra Pradesh
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వైరస్ వ్యాప్తికి అడ్డుకట్టపడటం లేదు. ఫలితంగా పాజిటివ్ కేసుల సంఖ్య కూడా విపరీతంగా పెరిగిపోతోంది. గత 24 గంటల్లో కూడా మరో 50 కొత్త కేసులు వెలుగు చూశాయి. ఈ కేసులతో కలుపుకుంటే రాష్ట్రంలో మొత్తం నమోదైన కేసులు సంఖ్య 1980కు చేరింది. వీరిలో ఇప్పటివరకు 925 మంది డిశ్చార్జ్ కాగా, 45 మంది మరణించారని వివరించింది.
 
ప్రస్తుతం ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నవారి సంఖ్య 1,010గా ఉందని ఆంధ్రప్రదేశ్ వైద్య, ఆరోగ్య శాఖ బులెటిన్‌లో తెలిపింది. రాష్ట్రంలో గత 24 గంటల్లో అనంతపురంలో 5, చిత్తూరులో 16, గుంటూరులో 6, కడపలో 1, కృష్ణాలో 1, నెల్లూరులో 5, కర్నూలులో 13, ప్రకాశంలో 2, విశాఖపట్నంలో 1 కేసు నమోదయ్యాయి. కర్నూలులో కరోనా నిర్ధారిత కేసుల సంఖ్య 566కి చేరింది.
 
ఏపీలో జిల్లాల వారీగా నమోదైన కేసు వివరాలను పరిశీలిస్తే, అనంతపురం 107, చిత్తూరు 112, ఈస్ట్ గోదావరి 15, గుంటూరు 382, కడప 97, కృష్ణ 339, కర్నూలు 566, నెల్లూరు 101, ప్రకాశం 63, శ్రీకాకుళం 5, విశాఖపట్టణం 63, విజయనగరం 4, వెస్ట్ గోదావరి 68, గుజరాత్, కర్నాటక రాష్ట్రాలకు చెందిన వలస కూలీల్లో 27 మందికి ఈ వైరస్ సోకినట్టు నిర్ధారణ అయింది. 
About Writer
ఠాగూర్
తర్వాతి కథనం
ఎల్బీ నగర్‌లో కొంప ముంచిన బర్త్‌డే పార్టీ - 45 మందికి కరోనా