1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరోనా
  4. corona is expanding rapidly, why testing process slowly? High Court to Telangana government

కరోనా వేగంగా విస్తరిస్తుంటే నెమ్మదిగా పరీక్షలేంటి? తెలంగాణ సర్కార్ పైన హైకోర్టు అసంతృప్తి

corona
తెలంగాణలో కరోనా పరిస్థితులపై మంగళవారం హైకోర్టులో విచారణ జరిగింది. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం కరోనా పరీక్షలు, చికిత్స, నియంత్రణపై నివేదిక సమర్పించింది. బార్లు, పబ్‌లు, థియేటర్లపై ఎందుకు ఆంక్షలు విధించడం లేదో తెలపాలని హైకోర్టు ఆదేశించింది.
 
ఆర్టీపీసీఆర్‌ పరీక్షలు అతితక్కువగా చేస్తున్నారని, పూర్తిగా ర్యాపిడ్‌ టెస్టులపైనే దృష్టి పెట్టారని ఉన్నత న్యాయస్థానం అసంతృప్తి వ్యక్తం చేసింది. ఆర్టీపీసీఆర్‌ పరీక్షలు 10 శాతం కూడా లేవని ధర్మాసనం పేర్కొంది.
 
ఆర్టీపీసీఆర్‌ పరీక్షలు నెమ్మదిగా పెంచుతున్నామని ఏజీ వివరణ ఇవ్వగా.. రెండో దశ కరోనా వేగంగా విస్తరిస్తుంటే ఇంకా నెమ్మదిగా పెంచడమేంటని హైకోర్టు వ్యాఖ్యానించింది.
తర్వాతి కథనం
కరోనా విజృంభణ: ఢిల్లీలో రాత్రిపూట కర్ఫ్యూ విధింపు