సంబంధిత వార్తలు
- నిన్న కొడుకు, నేడు తండ్రి: కరోనా కాటుకు కడపలో సాక్షి జర్నలిస్ట్ ప్రభాకర్ రెడ్డి కుటుంబంలో వరుస ఘటన
- ఇంట్లో - ఆఫీసులో ఒకరికి కరోనా వచ్చిందని తెలియగానే మిగతా వారు ఏం చేయాలి?
- తెలంగాణలో నేటి నుంచి రాత్రి కర్ఫ్యూ
- విజయవాడలో కరోనా కలకలం - ఇద్దరు కార్పొరేటర్లకు కరోనా
- పవన్ కరోనా వల్ల వెళ్ళిపోయాడా, లేక కరెన్సీ అందలేదని బాధపడి క్వారంటైన్‌కు వెళ్ళాడా? అంబటి ఎద్దేవా
వ్యాక్సిన్ తీసుకున్న 26 వేల మందికి కరోనావైరస్
కొవిడ్ టీకా మొదటి డోసు తీసుకున్న తర్వాత దేశవ్యాప్తంగా సుమారు 21వేల మంది కరోనా బారినపడినట్లు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. రెండో డోసు తీసుకున్న తర్వాత సుమారు ఐదున్నర వేల మందికి కొవిడ్ సోకినట్లు తెలిపింది.
కరోనా వ్యాక్సిన్ మొదటి డోసు తీసుకున్న తర్వాత దేశవ్యాప్తంగా సుమారు 21వేల మందికి కరోనా సోకినట్లు కేంద్రం వెల్లడించింది. రెండో డోసు తీసుకున్న తర్వాత సుమారు ఐదున్నర వేల మంది కొవిడ్ బారినపడినట్లు వెల్లడించింది. ఇప్పటివరకూ కోటీ పదిలక్షల మందికి కొవాగ్జిన్ టీకాలు అందించామని ఐసీఎంఆర్ డైరెక్టర్ జనరల్ బలరాం భార్గవ తెలిపారు.
మొదటి డోసు తీసుకున్న 93 లక్షల మందిలో 4వేల 208 మందికి కరోనా సోకినట్లు వివరించారు. కొవాగ్జిన్ టీకా రెండు డోసులు తీసుకున్న 17 లక్షల 37 వేల 178 మందిలో 695 మందికి కరోనా సోకినట్లు వెల్లడించారు. మొత్తం సంఖ్యలో ఇది 0.04 శాతమని.. కొవాగ్జిన్ టీకా తీసుకున్న పదివేల మందిలో నలుగురికి కొవిడ్ సోకినట్లు వివరించారు.
