సంబంధిత వార్తలు
- కరోనా వస్తుంది.. పోతోంది... అందువల్ల సహజీవనం తప్పదు : సీఎం జగన్
- నిజమైన ఆపద్బాంధవుడు : సోనూ సూద్ ఆస్తుల విలువ ఎంత?
- పుణ్యం కట్టుకున్న కరోనా వైరస్ : 33 సార్లు తర్వాత టెన్త్ పాసయ్యాడు...
- మహారాష్ట్రను వణికిస్తోన్న కరోనా వైరస్-24 గంటల్లో 227 మంది మృతి
- కరోనా వైరస్ అప్డేట్స్ : కొత్త కేసులు 47704 - మరణాలు 654
కరోనా పేషెంట్లు ప్రేమికులయ్యారు... డిశ్చార్జ్ అయ్యాక పెళ్లి చేసుకున్నారు..
అవును కరోనా పాజిటివ్ రావడంతో ఆస్పత్రిలో చేరిన ఆ ఇద్దరు ప్రేమికులయ్యారు. చికిత్సకు అనంతరం నెగటివ్ రావడంతో పెద్దల సమ్మతంతో వివాహం చేసుకున్నారు. ఈ ఘటన గుంటూరు జిల్లాలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. ప్రకాశం జిల్లా పర్చూరు ప్రాంతానికి చెందిన ఓ యువకుడికి, గుంటూరు జిల్లా చిలకలూరిపేటకు చెందిన ఓ యువతికి కరోనా పాజిటివ్ అని తేలడంతో వారు ఓ కార్పొరేట్ ఆసుపత్రిలో చేరారు.
ఇద్దరి బెట్లు కూడా పక్కపక్కనే వుండటంతో.. వీరిద్దరి మధ్య మాటలు కలవడంతో స్నేహితులయ్యారు. ఆపై ప్రేమికులుగా మారారు. కొద్ది రోజుల తర్వాత మళ్లీ టెస్టులు చేస్తే ఇద్దరికి నెగిటివ్ వచ్చింది. దీంతో ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయిన వెంటనే తమ ప్రేమ కథను తల్లిదండ్రులకు చెప్పారు. అబ్బాయి హైదరాబాద్‌లోని ఓ సాఫ్ట్‌వేర్ కంపెనీలో ఇంజనీర్‌గా ఉద్యోగం చేస్తున్నాడు.
అమ్మాయి కూడా ఇంజనీరింగ్ పూర్తి చేసి ఉద్యోగం కోసం వెతుకుతోంది. అంతే కాదు ఇద్దరి సామాజిక వర్గాలు కూడా ఒకటే కావడం, అబ్బాయి కూడా ఉద్యోగం చేస్తుండడంతో ఇరు కుటుంబాల పెద్దలు పెళ్లికి పచ్చజెండా ఊపారు. దీంతో ఈ నెల 25న పొన్నూరులోని ఓ దేవాలయంలో పెళ్లి చేసుకున్నారు. మొత్తానికి ప్రేమకథ మొత్తం పదిరోజుల వ్యవధిలోనే నడిచింది. పెళ్లి కూడా అయ్యింది. ప్రస్తుతం ఈ కరోనా ప్రేమకథ చర్చనీయాంశంగా మారింది.
