సంబంధిత వార్తలు
- థాయ్‌లాండ్‌లో ఓ వ్యక్తి కడుపులో టేప్ వర్మ పురుగులు.. ఎంత పొడవో తెలుసా?
- 72 గంటల్లో ప్రధాని మోడీ ఫోటోలన్నీ తొలగించాలి.. ఈసీ ఆదేశం
- వాషింగ్టన్లో రణరంగం : ట్రంప్ అభిశంసనపై మంత్రివర్గం మంతనాలు!
- గూగుల్ పే యూజర్లకు షాక్.. ఉచితంగా ఇక పేమెంట్స్ వుండవ్
- పాకిస్థాన్ మ్యాచ్ నుంచి పాక్ ఆక్రమిత కాశ్మీర్ మాయం.. షాకిచ్చిన సౌదీ!
"ఇండియన్ వేరియంట్" అనే పదం వాడారో.. అంతే సంగతులు!
"ఇండియన్ వేరియంట్" అనే పదంపై కేంద్ర ప్రభుత్వం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. ఈ పదాన్ని ఉపయోగిస్తూ... సోషల్ మీడియాలో చాలా మంది దేశ పరువు తీస్తున్నారని కేంద్ర ఎలక్ట్రానిక్స్, సమాచార టెక్నాలజీ శాఖ అభ్యంతరం వ్యక్తం చేసింది.
కరోనా వైరస్‌లోని డబుల్ మ్యూటెంట్ అయిన B.1.617ను చాలా మంది సోషల్ మీడియాలో... ఇండియన్ వేరియంట్ అని చెబుతున్నారు. ఐతే... ఇది ఇండియన్ వేరియంట్ అని ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ఎక్కడా చెప్పలేదు. దీన్ని వేరియబుల్ ఆఫ్ కన్సర్న్ అని మాత్రమే చెప్పింది. అంటే... ఈ వైరస్ వేర్వేరు దేశాల్లో విస్తరిస్తోందని అర్థం. అంతే తప్ప... దీనికీ, ఇండియాకీ సంబంధం ఉంది అని WHO చెప్పలేదు.
చాలా మంది సోషల్ మీడియాలో... దీన్ని ఇండియన్ వేరియంట్ అని అసత్య ప్రచారం చేస్తున్నారు. దీనిపైనే కేంద్ర సమాచార శాఖ ఫైర్ అవుతోంది. ఎవరైనా సరే... ఈ పదాన్ని ఇండియాకి లింక్ పెట్టి వాడి ఉంటే... తొలగించాల్సిందిగా నోటీస్ జారీ చేసింది. తప్పుడు సమాచారాన్ని అరికట్టేందుకే తామూ ఈ చర్య తీసుకుంటున్నట్లు తెలిపింది.
సో... నెటిజన్లు ఎవరైనా ఎక్కడైనా సోషల్ మీడియా సైట్లలో... B.1.617ను ఇండియన్ వేరియంట్ అని చెప్పి ఉంటే... వెంటనే ఆ వాక్యాన్ని తొలగించాల్సి ఉంటుంది. లేదంటే... చట్టపరమైన చర్యలు తప్పవు అని కేంద్రం తెలిపింది.
