1. క్రీడలు
  2. క్రికెట్
  3. మహామహులు
  4. Former Test star Syed Abid Ali dies aged 83

భారత తొలితరం క్రికెట్ దిగ్గజం అలీ ఇకలేరు...

Syed Abid Ali
భారత తొలితరం క్రికెట్ దిగ్గజం, అంతర్జాతీయ క్రికెట్ వన్డే మ్యాచ్‌లలో భారత్ తరపున తొలి బంతి విసిరిన సయ్యద్ అబిద్ అలీ కన్నుమూశారు. ఆయనకు వయసు 83 సంవత్సరాలు. హైదరాబాద్ నగరానికి చెందిన అలీ.. క్రికెట్ కెరీర్‌కు స్వస్తి చెప్పిన తర్వాత అమెరికాలోని కాలిఫోర్నియాలో స్థిరపడ్డారు. గత కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన తుది శ్వాస విడిచినట్టు ఆయన బంధువు రెజా ఖాన్ వెల్లడించారు. అలీ మృతిపట్ల టీమిండియా మాజీ క్రికెటర్లు తమ ప్రగాఢ సంతాపాన్ని సానుభూతిని వ్యక్తం చేస్తున్నారు. 
 
కాగా, 1964-74 మధ్యకాలంలో భారత జట్టుకు అలీ ప్రాతినిథ్యం వహించారు. 1974 జూలై 13వ తేదీన లీడ్స్‌లో ఇంగ్లండ్‌తో భారత్ ఆడిన తొలి వన్డే మ్యాచ్‌లో ఇండియా తరపున తొలి బంతిని వేసిన క్రికెటర్‌గా చిరస్మరణీయమైన ఘనతను సొంతం చేసుకున్నారు. 
 
ఆయన 29 టెస్టుల్లో 1,018 పరుగులు చేయగా, ఇందులో ఆరు అర్థ సెంచరీలు ఉన్నాయి. మీడియా పేస్ బౌలర్ అయిన అలీ టెస్టుల్లో 47 వికెట్లు తీశారు. ఐదు వన్డేల్లో 93 పరుగులు చేసి ఏడు వికెట్లు తీశారు. 1975లో జరిగిన వన్డే ప్రపంచ కప్‌లో న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో 98 బంతుల్లో 78 పరుగులు చేసి టాప్ స్కోరర్‌గా నిలిచారు. అదే ఆయన చివరి వన్డే మ్యాచ్ కావడం గమనార్హం. 
About Writer
ఠాగూర్
తర్వాతి కథనం
భారత్ వర్సెస్ న్యూజిలాండ్ ఫైనల్.. 90 crore views.. డిజిటల్ రికార్డ్