1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
  4. Dhoni as BAHUBALI Bahubali 2 trailer mashup

'బాహుబలి'గా ధోనీ.. సోషల్ మీడియాలో వైరల్...(Video)

మహేంద్ర సింగ్ ధోనీ ... భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్. భారత జట్టుకు ఒంటి చేత్తో ఎన్నో అద్భుతమైన విజయాలు అందించిన క్రికెట్ లెజెండ్. కానీ, ప్రస్తుతం స్వదేశంలో జరుగుతున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ పోటీలో

Dhoni
మహేంద్ర సింగ్ ధోనీ ... భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్. భారత జట్టుకు ఒంటి చేత్తో ఎన్నో అద్భుతమైన విజయాలు అందించిన క్రికెట్ లెజెండ్. కానీ, ప్రస్తుతం స్వదేశంలో జరుగుతున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ పోటీలో పెద్దగా రాణించలేదు. రానున్న ఛాంపియన్స్ ట్రోఫీలో కూడా ధోనీ ఆటతీరుపై పెద్దగా అంచనాలు లేవు. కెప్టెన్సీ నుంచి తప్పుకున్న అనంతరం ధోనీ ఆటతీరు దిగజారిపోయింది. 
 
ఈ నేపథ్యంలో ధోనీ ఆశ్చర్యపోయేలా... అతని అభిమానులు సోషల్ మీడియాలో మాషప్ వీడియో ఒకటి పోస్టు చేశారు. ఇందులో కనిపించేది మహేంద్ర సింగ్ ధోనీ అయినప్పటికీ... డైలాగులు మాత్రం మహేంద్ర  బాహుబలి (ప్రభాస్) చెప్పినవి కావడం విశేషం. 'బాహుబలి-2'లో మహేంద్ర బాహుబలి సర్వసైన్యాధ్యక్షుడిగా నియమితుడైన సందర్భంలో చేసిన ప్రమాణం ఈ వీడియోలో కనిపిస్తుంది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియోను మీరు కూడా చూసి ఆనందించండి.
About Writer
pnr
ఠాగూర్ పులపాక ప్రముఖ దినపత్రిక ఈనాడు, చెన్నై కార్యాలయంలో 'న్యూస్ కాంట్రిబ్యూటర్‌'గా జర్నలిజం ఓనమాలు నేర్చుకున్నారు. హైదరాబాద్ కార్యాలయంలో 'ఆంధ్రజ్యోతి' సబ్-ఎడిటర్ పని చేశారు. 2007 నుంచి 'వెబ్ దునియా'లో అసిస్టెంట్ ఎడిటర్‌‌గా విధులు నిర్వహిస్తున్నారు..... మరింత చదవండి
తర్వాతి కథనం
ఐపీఎల్-10.. చివరి లీగ్ మ్యాచ్‌లో పోరాడి ఓడిన ఢిల్లీ-కోహ్లీ సేన గెలుపు