శనివారం, 4 జనవరి 2025
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. ఐపీఎల్ 2017
Written By Selvi

ఐపీఎల్-10.. చివరి లీగ్ మ్యాచ్‌లో పోరాడి ఓడిన ఢిల్లీ-కోహ్లీ సేన గెలుపు

కాసుల వర్షం కురిపిస్తున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ పదో సీజన్లో భాగంగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు పది పరుగుల తేడాతో ఢిల్లీపై గెలుపును నమోదు చేసుకుంది. ఆదివారం జరిగిన ఐపీఎల్-10 చివరి లీగ్ మ్యాచ్‌లో బెంగళూర

కాసుల వర్షం కురిపిస్తున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ పదో సీజన్లో భాగంగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు పది పరుగుల తేడాతో ఢిల్లీపై గెలుపును నమోదు చేసుకుంది. ఆదివారం జరిగిన ఐపీఎల్-10 చివరి లీగ్ మ్యాచ్‌లో బెంగళూరు నిర్దేశించిన 162 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో ఢిల్లీ పోరాడి ఓడింది. 151 పరుగులు మాత్రమే సాధించింది.
 
ఢిల్లీ ఆటగాళ్లలో రిషభ్‌ పంత్‌ (34 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్సర్లతో 45) రాణించాడు. శ్రేయాస్‌ అయ్యర్‌ (32), కరుణ్‌ నాయర్‌ (26) శుభారంభం చేసినా.. భారీ స్కోరు మాత్రం నమోదు కాలేదు. చివర్లో మహ్మద్‌ షమి (21) పోరాడినా ఫలితం దక్కలేదు. బెంగళూరు బౌలర్లలో హర్షల్‌ పటేల్‌, పవన్‌ నేగి మూడేసి వికెట్లు పడగొట్టగా.. ట్రేవిస్‌ హెడ్‌ రెండు వికెట్లు సంపాదించాడు. 
 
అంతకుముందు టాస్‌ నెగ్గి బ్యాటింగ్‌ ఎంచుకున్న బెంగళూరు నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్లకు 161 పరుగులు చేసింది. కోహ్లీ (45 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్సర్లతో 58), క్రిస్‌ గేల్‌ (38 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్సర్లతో 48) రాణించారు. ఢిల్లీ బౌలర్లలో ప్యాట్‌ కమిన్స్‌ రెండు, జహీర్‌, నదీమ్‌ చెరో వికెట్‌‌ను తమ ఖాతాలో వేసుకున్నారు.