కర్నూలులో టీడీపీ కార్యకర్త దారుణ హత్య
కర్నూలు జిల్లాలో దారుణం జరిగింది. అధికార టీడీపీ కార్యకర్త ఒకరు దారుణ హత్యకు గురయ్యాడు. మాసుంబాషా దర్గా సమీపంలో గురువారం అర్థరాత్రి ఈ దారుణ హత్య జరిగింది. నగదు లావాదేవీ విషయంలో ఇంతియాజ్‌తో ఇద్దరు వ్యక్తులు గొడవపడ్డారు. ఈ క్రమలో వివాదం తీవ్రమైన వారు రాళ్లతో దాడి చేయడంతో తీవ్రంగా గాయపడిన ఇంతియాజ్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. మృతుడి వయసు 37 యేళ్లు.
ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు బాధితుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. దాడికి పాల్పడిన ఇద్దరు వ్యక్తులను ఇప్పటికే పోలీసులు అదుపులోకి తీసుకుని, పోలీస్ స్టేషన్‌లో విచారిస్తున్నారు. ఈ హత్య స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.
