సంబంధిత వార్తలు
- బస్సులో నిద్రపోతున్న యువతిని తాకరాని చోట తాకుతూ లైంగికంగా వేధించిన కండక్టర్ (video)
- మనమిద్దరం నల్లగా ఉంటే బిడ్డ ఇంత తెల్లగా ఎలా పుట్టాడు? భార్యను ప్రశ్నించిన భర్త... సూసైడ్
- అక్రమ సంబంధం బయటపడుతుందని ప్రియుడితో జతకట్టి భర్తను మట్టుబెట్టిన భార్య!!
- పెళ్లి చేసుకుంటానని హామి ఇచ్చి అత్యాచారం.. ఇన్స్టాగ్రామ్లో పరిచయం కాస్తా?
- Crime News : భార్య, అత్తపై క్యాబ్ డ్రైవర్ కత్తితో దాడి
బైకుపై వెళుతున్న దంపతులు.. నిర్మానుష్య ప్రాంతానికి చేరుకోగానే....
తెలంగాణ రాష్ట్రంలోని కీసర పోలీస్ స్టేషన్ పరిధిలో శనివారం రాత్రి చైన్ స్నాచింగ్ ఘటన ఒకటి చోటుచేసుకుంది. బైకుపై వెళుతున్న దంపతులను వెంటాడిన ఓ దొంగ... నిర్మానుష్య ప్రాంతానికి చేరుకోగానే ఆ మహిళ మెడలోని మంగళసూత్రాన్ని లాక్కెళ్లాడు. ఆ వెంటనే తేరుకున్న ఆ మహిళ భర్త తన బైకుతో దొంగను ఛేజ్ చేశాడు. కీసరలో స్థానికుల సాయంతో ఆ దొంగను పట్టుకుని చితకబాదారు. ఆపై స్థానిక పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లి అప్పగించారు.
కీసర నుంచి యాదగిరిపల్లెకు వెళుతుండగా ఈ ఘటన చోటుచేసుకుని బాధితురాలు చింతల పద్మ వెల్లడించారు. భర్తతో కలిసి బైకుపై వెళుతుంటే వెనుక నుంచి వచ్చిన దొంగ మెడలోని 4 తులాల మంగళసూత్రాన్ని లాక్కెళ్లాడని చెప్పారు. పద్మ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు.
