శుక్రవారం, 25 ఏప్రియల్ 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. క్రైం న్యూస్
Written By ఐవీఆర్
Last Modified: శుక్రవారం, 25 ఏప్రియల్ 2025 (13:36 IST)

బస్సులో నిద్రపోతున్న యువతిని తాకరాని చోట తాకుతూ లైంగికంగా వేధించిన కండక్టర్ (video)

KSRTC Conductor sexually harasses sleeping woman
బస్సులో నిద్రపోతున్న యువతిని తాకరాని చోట తాకుతూ లైంగికంగా వేధించాడు కేఎస్ఆర్టీసీ బస్సు కండక్టర్. ప్రయాణికులు బస్సులో ప్రయాణించేటపుడు వారికి ఎలాంటి అసౌకర్యం కలగుకుండా చూడాల్సిన కండక్టరే కామాంధుడుగా మారాడు. కర్ణాటకలోని మంగళూరు సమీపంలోని ముడిపు-స్టేట్ బ్యాంక్ మార్గంలో నడిచే కేఎస్ఆర్టీసీ బస్సులో పనిచేస్తున్న కండక్టర్ ఓ యువతి నిద్రపోతుండగా ఆమె పక్కనే వచ్చి నిలబడి ఆమెను పదేపదే తాకరాని చోట టచ్ చేస్తూ లైంగికంగా వేధించాడు.
 
కండక్టర్ చేస్తున్న ఈ వేధింపును గమనించిన తోటి ప్రయాణీకుడు తన మొబైల్ ఫోన్లో రికార్డ్ చేసాడు. ఈ వీడియో కాస్తా వైరల్ అయింది. ఈ వ్యవహారంపై రాష్ట్ర ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం చేసింది. వెంటనే కండక్టర్‌ను విధుల నుంచి తొలగిస్తూ కేఎస్ఆర్టీసీ నిర్ణయం తీసుకున్నది.