సంబంధిత వార్తలు
- నెల్లూరులో వైద్య విద్యార్థిని ఆత్మహత్య
- సీఎం జగన్ సొంత జిల్లాలో విద్యార్థి అనుమానాస్పద మృతి
- గ్లోబల్ సిటిజన్ స్కాలర్‌షిప్‌తో తమ అంతర్జాతీయ విద్యా ప్రయాణాన్ని ప్రారంభించిన ఆరుగురు విద్యార్థులు
- డీబార్ చేశారన్న కోపంతో ప్రిన్సిపాల్‌పై బ్లేడుతో విద్యార్థి దాడి..
- ఇంజినీరింగ్ విద్యార్థులకు అద్భుత అవకాశం, కోటి మందికి ఉచితంగా ఇంటర్న్‌షిప్
నమ్మి వచ్చిన డిగ్రీ విద్యార్థినిపై అత్యాచారం.. ఎక్కడ?
తెలంగాణ రాష్ట్రంలో డిగ్రీ విద్యార్థినిపై అత్యాచారం జరిగింది. తన స్నేహితులే కదా అని నమ్మి వెళ్లినందుకు ఆమెపై లైంగికదాడి జరిగింది. మొత్తం ఏడుగురు మిత్రుల్లో ఒకడు ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు.
ములుగు జిల్లా ఏటూరునాగారానికి చెందిన విద్యార్థి, వరంగల్‌కు చెందిన విద్యార్థిని, నల్గొండ జిల్లా మునుగోడుకు చెందిన ఇద్దరు విద్యార్థినులు, మరో ముగ్గురు విద్యార్థులు కలిసి నాలుగు బైక్‌లపై ఆదివారం ములుగు జిల్లా వాజేడుకు వెళ్లారు. అక్కడ సరదాగా గడిపారు. సాయంత్రం తిరుగు ప్రయాణంలో రింగ్ రోడ్డు మీదుగా హనుమకొండ జిల్లా కోమటిపల్లి వరకు చేరుకుని విశ్రాంతి కోసం కొద్దిసేపు ఆగారు.
ఈ క్రమంలో వరంగల్‌కు చెందిన విద్యార్థినిని... ఏటూరునాగారానికి చెందిన అన్వేశ్ అనే విద్యార్థి మాట్లాడే పనుందని చెప్పి... రింగ్ రోడ్డుకు కాస్త దూరంగా తీసుకెళ్లి అత్యాచారం చేశాడు. అనంతరం బైక్‌పై పారిపోయాడు.
మిగతా మిత్రులు బాధితురాలిని వరంగల్‌లో ఆమె ఇంటికి తీసుకెళ్లారు. విషయం తెలుసుకున్న ఆమె తల్లిదండ్రులు సోమవారం కేయూ పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసి, నిందితుడి కోసం గాలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
