సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. క్రైం న్యూస్
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 25 జులై 2022 (12:55 IST)

స్టార్ హోటల్‌లో హై ప్రొఫైల్ వ్యభిచారం... ఎక్కడ?

prostitute
స్టార్ హోటళ్ళలలో బడా బాబులే బస చేస్తుంటారు. వారికి కావాల్సిన అన్ని రకాల సౌకర్యాలను హోటల్ సిబ్బంది సమకూర్చుతుంటారు. ఇందుకోసం అయ్యే ఖర్చు కూడా భారీగానే ఉంటుంది. ఈ క్రమంలో ఓ స్టార్ హోటల్‌లో విదేశీ అమ్మాయిలతో గుట్టుగా సాగుతున్న హైప్రొఫైల్ వ్యభిచారాన్ని పోలీసులు బహిర్గతం చేశారు. ఈ ఘటన ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలో జరిగింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని రాయ్‌పూర్‌లో 4వ స్టార్ హోటల్‌లో హైప్రొఫైల్ సెక్స్ రాకెట్‌ను పోలీసులు గుర్తించారు. తేలిబాందా పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న హోటల్ హయత్‌లో సోదాలు చేయగా ఈ విషయం వెలుగులోకి వచ్చింది. ఇందులో పలువురు విదేశీ అమ్మాయిలను అరెస్టు చేశారు. 
 
వీరిలో గుజరాత్, హర్యానా, ఢిల్లీ, ముంబైతో పాటు బెంగుళూరుకు చెందిన అమ్మాయిలు కూడా ఉన్నారు. అలాగే, నేపాల్, బంగ్లాదేశ్ దేశాలకు చెందిన యువతులను కూడా అదుపులోకి తీసుకున్నారు. ఈ వ్యభిచారాన్ని నడిస్తున్న ఓ వ్యభిచారవృత్తి మధ్యవర్తిని కూడా అరెస్టు చేశారు. ఈ దాడుల్లో మొత్తం 11 మంది అమ్మాయిలను అరెస్టు చేశారు.