గురువారం, 23 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శనివారం, 16 అక్టోబరు 2021 (15:34 IST)

రాయ్‌పూర్ రైల్వే స్టేషన్‌లో భారీ పేలుడు - జవాన్లకు గాయాలు

ఛత్తీస్‌గడ్ రాష్ట్ర రాజ‌ధాని రాయ్‌పూర్‌ రైల్వేస్టేష‌న్‌లో శ‌నివారం ఉద‌యం భారీ పేలుడు సంభ‌వించింది. ఈ పేలుడు ఘ‌ట‌న‌లో న‌లుగురు సీఆర్పీఎఫ్ జ‌వాన్ల‌ు తీవ్రంగా గాయపడ్డారు. 
 
సీఆర్పీఎఫ్ ప్ర‌త్యేక రైలులో ఇగ్నైట‌ర్ బాక్స్ కింద‌ప‌డి పేలింది. ఈ ఘటనలో ఆరుగురు సెంట్రల్‌ రిజర్వ్‌డ్‌ పోలీస్‌ ఫోర్స్‌ (సీఆర్‌పీఎఫ్‌) సిబ్బంది తీవ్రంగా గాయడ్డారని.. వారిని రాయ్‌పూర్‌లోని నారాయణ ఆస్పత్రిలో చేర్చి చికిత్స అందిస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు.
 
శనివారం ఉదయం 6.30 సమయంలో జార్సుగూడ నుంచి జమ్మూతావి వెళ్తున్న రైలు ప్లాట్‌ఫామ్‌ మీద ఆగిన సమయంలో ఈ ప్రమాదం సంభవించింది. ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసు అధికారులు వెల్లడించారు. కాగా రైల్వే స్టేషన్‌లో ప్రమాదం జరగడంతో ప్రయాణికులంతా ఒక్కసారిగా భయంతో పరుగులు తీశారు.