మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఎంజీ
Last Updated : గురువారం, 23 సెప్టెంబరు 2021 (15:00 IST)

బెంగుళూరులో పేలుళ్లు - ముగ్గురు మృతి

ఐటీ రాజధాని బెంగూళూరు నగరంలో భారీ పేలుడు సంభవించింది. నగరంలోని చామరాజపేటలోని ఓ భవనంలో ఈ పేలుడు సంభవించింది. ఈ పేలుడులో ముగ్గురు దుర్మరణం చెందారు. పేలుడు ధాటికి మృతదేహాలు తునాతునకలయ్యాయి. 
 
ఈ ఘటనలో గాయపడిన మరికొందరి పరిస్థితి విషమంగా ఉంది. క్షతగాత్రులను విక్టోరియా ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున్న వి.వి.పురం పోలీసులు ఘటనాస్థలికి చేరుకొని పేలుడుకు గల కారణాలపై విచారణ చేపట్టారు.
 
ఆ భవన సముదాయంలో ఉన్న పంక్చర్ షాప్‌లోని కంప్రెషర్‌ వల్లే పేలుడు జరిగినట్లు స్థానికులు చెబుతున్నారు. ఈ ఘటనలో పంక్చర్‌ దుకాణ యజమాని అస్లాం అక్కడికక్కడే మృతి చెందాడు. పేలుడు శబ్దానికి స్థానికులు ఇళ్ల నుంచి బయటికి పరుగులు తీశారు.