వివాహం జరిగిన 18 రోజులకే ఏమైంది..? కళాశాల భవనం నుంది దూకేసింది..
crime news
చైతన్యపురి పోలీస్ స్టేషన్‌లో కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న శ్రీకాంత్ రెడ్డితో ఆమెకు ఆగస్టు 30న వివాహం జరిగింది. ఫిర్యాదు ప్రకారం, అదనపు కట్నం కోసం తన భర్త నుండి పల్లవి శారీరక, మానసిక వేధింపులకు గురైనట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ వేధింపుల వల్ల తీవ్ర మనస్తాపానికి గురైన ఆమె, మూడు అంతస్తుల కళాశాల భవనం పైనుంచి దూకింది.
మొదట పల్లవిని జీడిమెట్లలోని నీలిమ ఆసుపత్రికి తరలించారు, ఆ తర్వాత మెరుగైన చికిత్స కోసం మేడిపల్లిలోని శ్రీకార ఆసుపత్రికి తరలించారు. అయితే, చికిత్స పొందుతూ ఆమె మరణించింది. పల్లవి తల్లి సంధ్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఘట్‌కేసర్ పోలీసులు కేసు నమోదు చేశారు.
