1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
  4. YS Sharmila’s Daughter Anjili Reddy’s Wedding Date Fixed

వైస్ షర్మిల కుమార్తె వైస్ అంజలి రెడ్డి వివాహ తేదీ ఖరారు.. ఇడుపులపాయలో తొలి పత్రిక

YS Sharmila
YS Sharmila
కాంగ్రెస్ నేత వైస్ షర్మిల కుమార్తె వైస్ అంజలి రెడ్డి, సోమల రఘురామ్ రెడ్డిల వివాహ తేదీ ఖరారైంది. ఈ విషయాన్ని వైఎస్ షర్మిల ఎక్స్ వేదికగా పంచుకున్నారు. శ్రీ సోమల సుబ్బారెడ్డి, సోమల పద్మారెడ్డిల కుమారుడైన డాక్టర్ సోమల రఘురామ్ రెడ్డితో వైఎస్ అంజలి రెడ్డి వివాహం నిశ్చయమైంది. ఆమె పోస్ట్ ప్రకారం, నిశ్చితార్థం నవంబర్ 24న, వివాహం నవంబర్ 25న జరగనున్నాయి. 
 
అలాగే, డిసెంబర్ 5న వివాహ విందు (రిసెప్షన్) ఏర్పాటు చేశారు. ఈ శుభవార్తను పంచుకోవడం చాలా సంతోషంగా ఉందని షర్మిల పేర్కొన్నారు. ఇరు కుటుంబాలు కలిసి ఇడుపులపాయలోని వైఎస్సార్ ఘాట్‌ను సందర్శించి, అక్కడ మొదటి వివాహ ఆహ్వాన పత్రికను ఉంచినట్లు ఆమె తెలిపారు. 
 
కొత్త జీవితాన్ని ప్రారంభించబోతున్న ఈ జంటకు వైఎస్సార్ ఆశీస్సులు గొప్ప అండగా నిలుస్తాయని, ఆయన జీవితం,  విలువలు వారికి నిరంతరం స్ఫూర్తినిస్తాయని ఆమె అన్నారు.
About Writer
సెల్వి
Journalist since 2005. Former contributor at Eenadu & Andhra Jyothi Tamil Nadu Editions. Now in Sub Editor, Webdunia.... మరింత చదవండి
తర్వాతి కథనం
Ganesh Immersion, డీజే శబ్దానికి ఇద్దరు గుండెపోటుతో మరణం