1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. క్రైం న్యూస్
  4. UP Man Arrested for Brutal Murder of Girlfriend

మొక్కజొన్న తోటలో దారుణం : వేరొకరితో మాట్లాడుతుందని ప్రియురాలిని చంపేసిన ప్రియుడు...

murder
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని మొరదాబాద్‌ జిల్లాలో సభ్య సమాజం తలదించుకునే దారుణ ఘటన ఒకటి జరిగింది. తన ప్రియురాలు మరో వ్యక్తితో మాట్లాడుతుండటాన్ని చూసి సహించలేకపోయిన ప్రియుడు ఆమెను అత్యంత కిరాతకంగా పొడిచివేశాడు. ఆదివారం మైనాథెర్ ప్రాంతంలోని ఓ గ్రామానికి వెలుపల ఉన్న మొక్కజొన్న తోటలో జరిగింది. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. 
 
హత్యా సమాచారం తెలుసుకున్న పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని శవపరీక్ష నిర్వహించగా, హత్య ఎంత క్రూరంగా జరిగింది.  యువతి శరీరంపై, ప్రైవేటు భాగాలతో సహా మొత్తం 40కి పైగా స్క్రూ డ్రైవర్‌తో పొడిచి గాయాలు ఉన్నాయని వైద్యులు నిర్దారించారు. తీవ్రమైన రక్తస్రావం వల్లే ఆ యువతి మరణించినట్టు వైద్యుల నివేదిక వెల్లడించింది.
 
ఈ దారుణానికి పాల్పడింది 20 యేళ్ల మహ్మద్ రఫీ అని పోలీసులు గుర్తించారు. అతన్ని అరెస్టు చేసి విచారించగా, నేరాన్ని అంగీకరించాడు. తాను యువతికి ప్రియుడిని అని, గత మూడు నెలలుగా వేరొక వ్యక్తితో మాట్లాడుతుండటంతో తీవ్ర ఆగ్రహంతోనే ఈ పనికి పాల్పడినట్టు పోలీసులకు ఇచ్చిన వాంగ్మూలంలో వెల్లడించారు.
తర్వాతి కథనం
నేరగాళ్లను వెనకేసుకొచ్చే నాయకుడు దొరకడం వైకాపా అదృష్టం : ఆర్ఆర్ఆర్