1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. క్రైం న్యూస్
  4. Woman Dies in SR Nagar Lodge Room

ఎస్ఆర్ నగర్‌ హోటల్ గదిలో యువతి అనుమానాస్పద మృతి (వీడియో)

young girl dies
హైదరాబాద్ నగరం, ఎస్ఆర్ నగర్‌లో ఉన్న ఓ హోటల్ గదిలో ఓ యువతి అనుమానాస్పదంగా మృతి చెందింది. సి.గణేశ్ అనే యువకుడితో కలిసి ఆ యువతి గదికి వచ్చినట్టు ప్రాథమిక సమాచారం. మంగళవారం ఉదయానికి ఆ యువతి శవమై కనిపించింది. మృతురాలి ఆధార్ కార్డులో పేరు దుర్గగా ఉన్నట్లు సమాచారం. గతంలో ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందిన సమయంలో శిరీష పేరుతో నమోదు చేసుకున్నట్లు తెలుస్తోంది. భర్త కొట్టడంతో గతంలో ఆస్పత్రికి వెళ్లినట్లు సమాచారం. ప్రస్తుతం పోలీసులు సీసీటీవీ ఫుటేజ్, హోటల్ రికార్డులు పరిశీలిస్తూ మృతికి గల కారణాలపై దర్యాప్తు చేస్తున్నారు. 
 
కుటుంబ కలహాలతో భర్త హత్య - రోకలిబండతో కొట్టి చంపిన భార్య 
 
తెలంగాణ రాష్ట్రంలోని మంచిర్యాల పట్టణంలోని అశోక్ రోడ్‌లో దారుణ ఘటన చోటుచేసుకుంది. కుటుంబ కలహాల నేపథ్యంలో వైద్య మోహన్ (40) అనే వ్యక్తిని అతడి భార్య రోకలిబండతో కొట్టి హత్య చేసింది. సమాచారం అందుకున్న మంచిర్యాల పట్టణ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. 
 
ఘటనకు దారితీసిన కారణాలపై దర్యాప్తు చేపట్టారు. కుటుంబ కలహాలే హత్యకు కారణమా? మరేదేనా కారణంగా ఉందా? అనే కోణాల్లో విచారిస్తున్నారు. కాగా, మృత్డు, వైద్య మోహన్ ఓ యూట్యూబ్ చానెల్‌లో రిపోర్టుగా పని చేస్తున్నట్టు సమాచారం. అతనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సివుంది. 
 
కేంద్రం అండతో అభివృద్దిలో దూసుకెళుతున్నాం : సీఎం చంద్రబాబు 
 
కేంద్రం అండదండలతో అభివృద్ధిలో దూసుకెళుతున్నట్టు ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు న్నారు. రాష్ట్రంలో టీడీపీ కూటమి సర్కారు, కేంద్రంలో ప్రధాని మోడీ ప్రభుత్వం  ఉండటంతో డబుల్ ఇంజిన్ సర్కారు కారణంగానే ఇది సాధ్యమైందన్నారు. 
 
నెల్లూరు జిల్లా ఉదయగిరిని నియోజకవర్గంలోని రామాపురంలో పల్లె పండుగ 3.0 కార్యక్రమంలో డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌, భాజపా రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్‌ మాధవ్‌లతో కలిసి చంద్రబాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మాట్లాడారు.
 
'పల్లె పండుగ 3.0 కోసం రూ.11,085 కోట్ల నిధులు కేటాయిస్తున్నాం. మన పల్లెల్లో కొత్త వెలుగులు వస్తాయి. పవన్‌ కల్యాణ్.. గ్రామీణాభివృద్ధిశాఖలో అనేక మార్పులు తెచ్చారు. పంచాయతీరాజ్‌శాఖలో పలు కార్యక్రమాలు చేపట్టి నిత్యం పర్యవేక్షిస్తున్నారు. ప్రతి గ్రామంలో తాగునీరు, రోడ్లు, డ్రెయిన్లు, వీధిలైట్లు ఏర్పాటు చేశాం. ఉదయగిరి నుంచి పల్లెల్లో నవోదయానికి నాంది పలికాం. గ్రామాల్లో పేదరికం తగ్గించేందుకు అనేక చర్యలు చేపట్టాం.
 
ఉదయగిరి నియోజకవర్గం.. పండ్లతోటల హబ్‌గా మారుతుంది. రెండేళ్ల క్రితం ఉన్న పరిస్థితులు మీరంతా గుర్తుంచుకోవాలి. సూపర్‌సిక్స్‌ హామీలిచ్చి మాట నిలబెట్టుకున్నాం. అనేక కష్టాలున్నా తట్టుకుని పలు పథకాలు అమలు చేస్తున్నాం. తల్లికి వందనం, స్త్రీశక్తి ద్వారా మహిళలకు అండగా నిలిచాం. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చాం. స్థానిక సంస్థల్లో మాకు అండగా నిలిచేందుకు మీరంతా సిద్ధంగా ఉన్నారు' అని సీఎం అన్నారు. 
 
About Writer
ఠాగూర్
ఠాగూర్ పులపాక ప్రముఖ దినపత్రిక ఈనాడు, చెన్నై కార్యాలయంలో 'న్యూస్ కాంట్రిబ్యూటర్‌'గా జర్నలిజం ఓనమాలు నేర్చుకున్నారు. హైదరాబాద్ కార్యాలయంలో 'ఆంధ్రజ్యోతి' సబ్-ఎడిటర్ పని చేశారు. 2007 నుంచి 'వెబ్ దునియా'లో అసిస్టెంట్ ఎడిటర్‌‌గా విధులు నిర్వహిస్తున్నారు..... మరింత చదవండి
తర్వాతి కథనం
మహిళల్లో ఆర్థిక అవగాహన, పెట్టుబడులను ప్రోత్సహించడానికి హెచ్‌డీఎఫ్‌సీ మ్యూచువల్ ఫండ్ 'నారీ నివేశ్ యాత్ర' ప్రారంభం