అధిక ధరలతో ఆసియాలో అలజడులు
ఇటీవలి కాలంలో ఎన్నడూ లేనంతగా ఆహార పదార్ధాల ధరలు చుక్కలంటుతుండటంతో ఆసియా దేశాల్లో నిరసనలు, సమ్మెలు, అలజడులు తీవ్రతరం కానున్నాయని పరిశీలకుల వ్యాఖ్య. ప్రజలు తప్పనిసరిగా వాడే నిత్యావసర వస్తువుల ధరలు కొండెక్కి కూచోవటంతో ఇది ప్రభుత్వ వ్యతిరేక ఓటుగా ఎక్కడ మారుతుందో అని పలు ఆసియా దేశాల ప్రభుత్వాలు తలపట్టుకు కూచున్నాయని పరిశీలకులంటున్నారు.
ఆసియాఖండ వ్యాప్తంగా ఆహార పదార్థాలు ప్రత్యేకించి వరి ధాన్యం ధరలు భరించలేనంత స్థాయిలో పెరిగిపోవడంతో అన్ని దేశాల్లో సామాజిక అశాంతి ప్రబలే ప్రమాదం ఉందని అక్కడి ప్రభుత్వాలు కలవరపడుతున్నాయి. ఈ అశాంతి ప్రభావం మలేసియా, సింగపూర్ వంటి సంపన్న ఆసియా దేశాల కంటే పేద దేశాలమీదే ఎక్కువగా పడే అవకాశం ఉందని సింగపూర్‌లోని ఆగ్నేయాసియా స్టడీస్ సంస్థ పరిశోధకుడు ఓయి కీ బెంగ్ హెచ్చరించారు.
ఈ అధిక ధరల ప్రభావానికి అన్నిటికన్నా ఎక్కువగా బంగ్లాదేశ్, పిలిప్ఫీన్స్ దేశాలే గురికానున్నాయని బెంగ్ తెలిపారు. ఆహార ధరలు పెరిగిన కారణంగా సమాజంలో తీవ్రమైన అసమ్మతి, హింస చెలరేగడమే కాక ఆహారదాడులు కూడా జరిగే ప్రమాదం ఉందని బంగ్లాదేశ్ రాజనీతి శాస్త్రవేత్త అతుర్ రహ్మాన్ అభిప్రాయం వ్యక్తం చేశారు.
ప్రపంచంలోనే వరిధాన్యాన్ని అధికంగా దిగుమతి చేసుకునే పిలిప్ఫైన్స్లో అయితే రాజధాని మనీలాలో నిరుపేదలు నివసించే ప్రాంతాల్లో ఆహార ధాన్యాలు పంపిణీ చేసేందుకు గత వారం సైనిక దళాలను నియమించారంటే పరిస్థితి ఎంతగా దిగజారిందో అర్థమవుతుంది. రాజధాని నగరంలోనే ఆహారం కొరత ఏర్పడే పరిస్థితిలో అక్కడి ప్రభుత్వం నలుగుతోంది.
మరోవైపున బంగ్లాదేశం, ఇండోనేషియా దేశాల్లోని పేదలు తమ ఆదాయంలో దాదాపు 70 శాతం పైగా ఆహారం కోసమే ఖర్చుపెడుతున్నారు.