1. వార్తలు
  2. బిజినెస్
  3. కథనాలు
  4. India-s Growing EV Adoption Brings Emerging Vehicle Risks into Focus

భారత్‌లో ఈవీల వినియోగం పెరుగుదల: వాహనాలకు పొంచి ఉన్న కొత్త రిస్కులు

Lexus cars
తాజా రిజిస్ట్రేషన్ గణాంకాల ప్రకారం ఇటీవలి కాలంలో ఈవీల మార్కెట్ అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్నట్లుగా తెలుస్తున్న నేపథ్యంలో ఎలక్ట్రిక్ వాహనాల యజమానులు తమ వాహన బీమాను సమీక్షించుకోవాలంటూ భారతదేశపు అగ్రగామి జనరల్ ఇన్సూరెన్స్ సంస్థల్లో ఒకటైన టాటా ఏఐజీ జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్(టాటా ఏఐజీ) పిలుపునిచ్చింది.
 
వాహన్ రిజిస్ట్రేషన్ డేటా ప్రకారం 2026 జనవరి, సెప్టెంబర్ మధ్య కాలంలో భారత్‌లో 25.37 లక్షల ఈవీలు రిజిస్టరయ్యాయి. గతేడాది ఇదే వ్యవధిలో రిజిస్టరైన 16.70 లక్షలతో పోలిస్తే ఇది 51.9 శాతం అధికం. 2025 మొత్తం మీద 23,56,971 ఈవీలు రిజిస్టర్ కాగా 2026లో కేవలం తొమ్మిది నెలల వ్యవధిలోనే అంతకు మించి రిజిస్ట్రేషన్లు జరిగాయి. వృద్ధి కూడా వేగవంతమైంది. 2024లో వృద్ధి 28 శాతంగా ఉండగా, 2025లో 16.3 శాతంగా నమోదైంది.
 
ఈ వ్యవధిలో నమోదైన మొత్తం కొత్త వాహన రిజిస్ట్రేషన్లలో ఈవీల వాటా 10.7 శాతానికి చేరింది. అంతకుముందు ఏడాది ఇది 8.6 శాతంగా నమోదైంది. 2026లో ప్రతి నెలలోనూ 2025తో పోలిస్తే వృద్ధి నమోదవుతూనే ఉంది. 76.1 శాతం వృద్ధితో 3,37,240 ఈవీల రిజిస్ట్రేషన్లతో సెప్టెంబర్ అత్యంత పటిష్టమైన నెలగా నిలచింది. పండుగ త్రైమాసికాన్ని ఇంకా పరిగణనలోకి తీసుకోవాల్సి ఉండగా, ఇదే వేగం కొనసాగితే 2026లో సుమారు 33.8 లక్షల ఈవీలు రిజిస్టర్ కాగలవు.
 
దేశీయంగా ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం వేగంగా పెరుగుతుండటంతో, వాటికి సంబంధించిన ఇన్సూరెన్స్ అవసరాలు కూడా మారుతున్నాయి. సంప్రదాయ ఇంధన వాహనాలతో పోలిస్తే ఈవీలకు బ్యాటరీ దెబ్బతినడం, ప్రత్యేక మరమ్మతు అవసరాలు, ఛార్జింగ్ సంబంధిత ప్రమాదాల రూపంలో భిన్నమైన రిస్కులు ఉంటాయి. ఈ నేపథ్యంలో వాహనదారులు తమ మోటార్ ఇన్సూరెన్స్ పాలసీలు ఈ ప్రమాదాలను ఏవిధంగా కవర్ చేస్తున్నాయనే దానిపై అవగాహన కలిగి ఉండటం ఎంతో కీలకమని నిపుణులు పేర్కొంటున్నారు.
 
"భారతదేశంలో ఈవీ ప్రస్థానం ప్రారంభ దశ దాటి ప్రస్తుతం ప్రధాన స్రవంతిలోకి చేరింది. దీనితో వాహన యజమానులు తమ వాహన రక్షణ గురించి ఆలోచించే విధానం మారుతోంది. ఎలక్ట్రిక్ వాహనాల యొక్క రిస్క్ ప్రొఫైల్, సంప్రదాయ వాహనాలకి పూర్తిగా భిన్నంగా ఉంటుంది. ఇందులో బ్యాటరీ అత్యంత విలువైన భాగం కాగా, మరమ్మతులకు ప్రత్యేక నైపుణ్యం అవసరమవుతుంది. పైగా ఇల్లు, రహదారులపై ఛార్జింగ్ చేయడం ద్వారా కొత్త రకాల ప్రమాదాలకు అవకాశం ఉంటుంది" అని టాటా ఏఐజీ జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్, మోటార్ అండర్‌రైటింగ్ హెడ్ ఎ. కిరణ్ కుమార్ తెలిపారు.
 
ఎలక్ట్రిక్ మొబిలిటీ వైపు అడుగులు వేస్తున్న వినియోగదారులు సరైన అవగాహనతో కూడిన మోటార్ ఇన్సూరెన్స్ ఎంపికలను చేసుకోవడానికి ప్రాధాన్యం ఇవ్వాలని టాటా ఏఐజీ జనరల్ ఇన్సూరెన్స్ సూచిస్తోంది. ఈవీ యజమానులు తమ పాలసీల పరిధిని క్షుణ్ణంగా పరిశీలించాలి. ముఖ్యంగా బ్యాటరీ సంబంధిత నష్టాలకు లభించే కవరేజీ, ఛార్జింగ్ పరికరాల రక్షణ, ప్రమాదవశాత్తు జరిగే నష్టాలు, ఎలక్ట్రిక్ సర్జ్ సెక్యూర్ కవర్, బ్యాటరీ కన్వీనియన్స్ కవర్, వాల్ ఛార్జర్ ప్రొటెక్షన్ కవర్ వంటి యాడ్-ఆన్ ప్రొటెక్షన్లను సరిగ్గా అంచనా వేసుకోవాలి. అలాగే అత్యవసర సమయంలో ఇబ్బంది కలగకుండా పాలసీ మినహాయింపులు, డిడక్టబుల్స్, క్లెయిమ్ నిబంధనలపై అవగాహన పెంచుకోవాలి.
 
ఎలక్ట్రిక్ త్రీ-వీలర్లు, ఇతర వ్యాపార/రవాణా ఈవీల వాడకం పెరుగుతుండటంతో వ్యాపార సంస్థల ప్రొటెక్షన్ విషయం కూడా ప్రధానాంశంగా మారింది. వాణిజ్య సంస్థలకు కేవలం వాహన నష్టపరిహారమే కాకుండా, నిరంతరాయంగా వ్యాపార కార్యకలాపాల నిర్వహణ, మరమ్మతుల వల్ల వృధా అయ్యే సమయం, ఫ్లీట్ స్థాయి రిస్కులను దృష్టిలో ఉంచుకుని తగిన ఇన్సూరెన్స్‌ను ఎంచుకోవడం అవసరం.
 
భారత్‌లో ఈవీల మార్కెట్ విస్తరించే కొద్దీ, నిర్దిష్ట వాహనాలకు సంబంధించిన బీమా అవసరాల గురించి మరింత అవగాహన కలిగి ఉంటే వినియోగదారులు, వ్యాపార సంస్థలు భద్రతకు సంబంధించి మరింత మెరుగైన నిర్ణయాలు తీసుకునేందుకు ఉపయోగకరంగా ఉంటుంది. సముచిత కవరేజీ, రిస్క్‌లపై అవగాహనను కల్పించడం ద్వారా భారతదేశపు తదుపరి మొబిలిటీ పరివర్తనకు బీమా పరిశ్రమ దోహదపడేందుకు అవకాశం ఉంటుంది.
About Writer
ఐ వెెంకట్
నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ(NIFT) హైదరాబాదులో సిపిఎఫ్‌సి కోర్సు చేసారు. జర్నలిజంలో రెండు దశాబ్దాలకు పైగా అనుభవం. కవితలు, కథలు రాస్తుంటారు. ప్రముఖ మీడియా సంస్థలలో పనిచేసారు..... మరింత చదవండి
తర్వాతి కథనం
అర్మేనియాలో చితక్కొట్టుకున్న ఎంపీలు... లైవ్ స్ట్రీమింగ్ చేసిన స్పీకర్