1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
  4. Caffeine: Does it Affect Your Fertility and Pregnancy?

మహిళలూ సంతానం కలగాలంటే కాఫీ తాగకండి.. నిజమేంటో తెలుసుకోండి!

Caffeine: Does it Affect Your Fertility and Pregnancy?
పురుషుల్లో చాలామంది టీ ప్రియులు.. మహిళల్లో చాలామంది కాఫీ ప్రియులుగా ఉండటం మనం చూసేవుంటాం. అయితే కాఫీ విషయంలో పరిశోధకులు కొత్త విషయాన్ని కనుగొన్నారు. అదేంటంటే? మహిళలు కాఫీ ఎక్కువ తాగితే సంతానం కలగదంటున్నారు. రోజూ రెండు కప్పుల కాఫీ తీసుకునేవారిలో ఆరోగ్యానికి మేలు చేసే కఫైన్.. మితిమీరితే సంతానలోపాన్ని ఏర్పరుస్తుందని తాజా పరిశోధనలో తేలింది. కాఫీ, టీ, కూల్‌డ్రింక్స్‌లను అధికంగా తీసుకునే వారిలో సంతానలేమి తప్పదని పరిశోధకులు అంటున్నారు.  
 
అందుచేత రోజూ రెండు కప్పుల కంటే ఎక్కువగా కాఫీ లేదా టీ తాగితే అలవాటున్నవారు ఆ అలవాటును తగ్గించుకోవడం మంచిది. ముఖ్యంగా కాఫీలు రెండు కప్పుల కంటే ఎక్కువగా తీసుకునే వారు మాత్రం తప్పకుండా మానేయాల్సిందేనని పరిశోధకులు సూచిస్తున్నారు. పిల్లలు కలగాలంటే కాఫీని పక్కనబెట్టడటమే సరైన మార్గమని వారు చెప్తున్నారు. కాఫీల్లోని కఫైన్ నరాల సామర్థ్యాన్ని పెంచగలదు. 
 
అందుకే కాఫీ తాగిన వెంటనే కొత్త ఉత్సాహం ఏర్పడుతుంది. అయితే రోజుకు రెండు కప్పులైతే ఓకే కానీ.. కఫైన్ శాతం పెరిగితే మాత్రం సంతానం కలిగే అవకాశాలు చాలామటుకు తగ్గిపోతాయని జర్నల్ ఫెర్టిలిటి అండ్ స్టెరిలిటీ పరిశోధకులు వెల్లడించారు. 344 యువతులపై జరిపిన ఈ పరిశోధనలో కఫైన్ గర్భస్రావానికి కారణమవుతుందని కనుగొన్నారు. అంతేకాదు.. కాఫీ, టీ, కూల్‌డ్రింక్స్‌లలో కూల్ డ్రింక్స్‌ల్లో ఉన్నట్లు వారు గుర్తించారు.
తర్వాతి కథనం
బ్లడ్ బ్లాంకులోని రక్తం సురక్షితమా? రక్తమార్పిడి ద్వారా 2234 మందికి హెచ్ఐవీ!