సంబంధిత వార్తలు
- కోవిడ్ వ్యాక్సిన్ తీసుకున్నా మళ్లీ కరోనావైరస్ ఎందుకు సోకుతుంది?
- వ్యాక్సినేషన్ సర్టిఫికేట్ తప్పనిసరి అనే నిబంధన లేదు : కేంద్రం స్పష్టం
- కోవిడ్ వ్యాక్సినేషన్ డ్రైవ్: 4నెలలలో మూడు కోట్ల వ్యాక్సిన్లు
- ఆ మహిళ నాలుగు డోసుల కోవిడ్ టీకా తీసుకున్నా.... కరోనా పాజిటివ్
- గూగుల్ సంచలన నిర్ణయం : కోవిడ్ వ్యాక్సిన్ వేసుకున్నవారికే వేతనం
దగ్గు, జలుబు వున్నప్పుడు కోవిడ్ టీకా తీసుకోవచ్చా?
ఒక వ్యక్తి అనారోగ్యానికి గురైనప్పుడు దానర్థం శరీరం అంటువ్యాధి లేదా వైరస్ బారిన పడినట్లు అర్థం. అంటే రోగనిరోధక వ్యవస్థ ఇప్పటికే ఒత్తిడికి లోనైన స్థితిలో ఉందని అర్థం. సూక్ష్మక్రిమిని శరీరం నుంచి తొలగించడానికి మన శరీర వ్యవస్థ తీవ్రంగా కృషి చేస్తుంది.
ఒక వ్యక్తి యొక్క రోగనిరోధక శక్తి ఆరోగ్యంగా బాగా వున్నప్పుడు, ఎలాంటి ఒత్తిడి లేకుండా ఉన్నప్పుడు టీకా ఉత్తమంగా పనిచేస్తుందని అందరికీ తెలుసు. ఐతే అప్పటికే ఉన్న అనారోగ్యం, లేదా అనారోగ్యంగా వున్న సమయంలో, రోగనిరోధక వ్యవస్థ ఇప్పటికే వైరస్‌తో పోరాడటంలో బిజీగా ఉంటుంది.
అంటే.. ఆ సమయంలో వ్యాక్సిన్ తీసుకుంటే దాని పనితీరుపై ప్రభావం పడుతుంది. అందుకే ఏమైనా రుగ్మతలు వున్నప్పుడు అవి తగ్గాక టీకా తీసుకోవాలని వైద్య నిపుణులు చెపుతుంటారు. దగ్గు, జ్వరం వంటి శ్వాసకోశ లక్షణాలతో బాధపడటం ప్రస్తుత కాలంలో రెట్టింపు ప్రమాదకరం. ఎందుకంటే అవి కోవిడ్ 19 లక్షణాలు కూడా కావచ్చు. అందువల్ల సమస్య మామూలేగా అని వదిలేయకూడదు.
తర్వాతి కథనం
