1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
  4. Dry Fruits Health Benefits

డ్రై ఫ్రూట్స్ ఎందుకు తినాలి, ప్రయోజనాలు ఏమిటి

Dry Fruits Health Benefits
డ్రై ఫ్రూట్స్. వీటిలో శరీరానికి అవసరమైన పోషకాలు వున్నాయని నిపుణులు చెబుతున్నారు. రకరకాల అనారోగ్య సమస్యలు ఉత్పన్నం కాకుండా వుండాలంటే తగిన పోషకాహారం తీసుకోవాలి. అందుకే ఉదయం వేళ సాధ్యమైనన్ని డ్రైఫ్రూట్ తింటుండాలి. వీటితో కలిగే ప్రయోజనం ఏమిటో తెలుసుకుందాము.
 
బాదం పప్పు: 10 బాదంపప్పులు తినడం వల్ల రోజువారీ విటమిన్ ఇ అవసరాలలో 50% లభిస్తుంది. నియాసిన్, కాల్షియం, విటమిన్ ఇ, ఫైబర్, రిబోఫ్లావిన్, ఒమేగా-6 కొవ్వు ఆమ్లాలు తదితర పోషకాలున్నాయి.
పిస్తాపప్పులు: పిస్తాలో డైటరీ ఫైబర్ ఉంటుంది, ఇది మన కడుపుకు ప్రయోజనకరంగా ఉంటుంది. జీర్ణశయాంతర ఆరోగ్యానికి సహాయపడుతుంది.
అక్రోట్లు: మెదడుకు ఆరోగ్యకరం. పాలీఅన్‌శాచురేటెడ్ ఫ్యాట్, పాలీఫెనాల్స్, మెదడు ఆరోగ్యాన్ని పెంపొందించే విటమిన్ ఇ పుష్కలంగా ఉన్నాయి.
జీడిపప్పు: జీడిపప్పులో సున్నా కొలెస్ట్రాల్ ఉంటుంది. కనుక గుండెకు ఎలాంటి హాని చేయదు.
ఖర్జూరాలు: ఎండు ఖర్జూరాలను నెయ్యిలో వేయించి రోజుకు 2-3 సార్లు తీసుకుంటే దగ్గు నుండి ఉపశమనం కలుగుతుంది.
వాల్ నట్స్: ఇవి తింటుంటే ప్రాణాంతక వ్యాధులైన క్యాన్సర్, డయాబెటీస్ వంటి వ్యాధులను తగ్గిస్తాయి.
ఎండుద్రాక్ష: వీటిని తీసుకోవడం వలన ఐరన్, విటమిన్ బి కాంప్లెక్స్ అందటంతో బ్లడ్ కౌంట్ త్వరగా పెరిగే అవకాశం ఉంది.
About Writer
సిహెచ్
తర్వాతి కథనం
మంకీపాక్స్ లక్షణాలు, తీసుకోవలసిన జాగ్రత్తలు