శుక్రవారం, 7 ఫిబ్రవరి 2025
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By సిహెచ్
Last Modified: శనివారం, 10 ఆగస్టు 2024 (23:03 IST)

చిన్న వయసులోనే గుండె జబ్బులు ఎందుకు వస్తున్నాయి?

Heart
ఇటీవలే యువ నటి గుండెపోటుకు గురై కన్నుమూశారు. 18-20 సంవత్సరాల వయస్సు గల అబ్బాయిల కేసులు కూడా నమోదవుతున్నాయి. టీనేజ్ వయసులో గుండె జబ్బులు ఎందుకు వస్తున్నాయో తెలుసుకుందాము.
 
ధూమపానం చేయరాదు. ఇది గుండెపోటుకు ప్రధాన కారణాలలో ఒకటి.
మద్యపానానికి దూరంగా ఉండాలి, చిన్న వయస్సులోనే గుండెపోటుకు ఇది ప్రధాన కారణం.
జంక్ లేదా ఫాస్ట్ ఫుడ్ బరువు పెరగడానికి దారితీసి రోగనిరోధక శక్తిని బలహీనపరుస్తుంది, దీనితో గుండెపోటు రావచ్చు.
ఓవర్ టైం వర్క్ వల్ల హృదయంపై ఒత్తిడి పడుతుంది, శరీరానికి విశ్రాంతి ఇవ్వకపోవడం కూడా ఒక కారణం.
ఒత్తిడి శరీరానికి శత్రువు. లోపల టెన్షన్‌ను ఉంచుకోవడం వల్ల గుండెపోటు వచ్చే ప్రమాదం ఉంది.
జిమ్‌లో అతిగా వ్యాయామం చేయడం, శరీరం పూర్తిగా అలసిపోవడం కూడా గుండెపై అదనపు ఒత్తిడిని కలిగిస్తుంది.
సోమరితనం కూడా గుండెపోటు ప్రమాదాన్ని పెంచుతుంది.
నిద్రా సమయం తగ్గిపోవడం కూడా ఒక కారణం. నేటి అబ్బాయిలు రాత్రిపూట ఆలస్యంగా నిద్రపోతూ పొద్దున్నే లేస్తారు.
ఎప్పటికప్పుడు వైద్యుల సలహా తీసుకుంటుండాలి.