1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
  4. lemon juice with warm water health benefits

నిమ్మరసం అలా ఉదయాన్నే తాగితే?

lemon juice
ఇపుడు ఆరోగ్యం గురించి చాలా శ్రద్ధ తీసుకుంటున్నారు. ఐతే కొంతమంది ఉదయం గోరువెచ్చటి మంచినీళ్లు తాగుతుంటారు. ఇలా తాగే నీటిలో కాస్త నిమ్మరసం, తేనె కలుపుకుని తాగితే మంచిది. కానీ దేనికి ఎంత వరకు ప్రాధాన్యమివ్వాలో, ఎలా తాగాలో చాలామందికి తెలియదు. ఈ ఫార్ములా మంచిదే కదా అని కొందరు అధికంగా నిమ్మరసాన్ని వాడుతుంటారు. అలా చేస్తే పులుపు దంతాల చిగుళ్లను దెబ్బతీస్తాయి.
 
అందుకే.. సగం నిమ్మపండుకంటే ఎక్కువ వాడకూడదు. నిమ్మకు బరువు తగ్గించే గుణం ఉంది కదా అని దానిని ఎక్కువ వాడితే ఎసిడిటీ వృద్ధి చెందుతుంది. అది చేసే అసలు పనికి ఆటంకం ఏర్పడుతుంది. మోతాదుకు మించి వాడొద్దు. వేడి నీళ్లలో నిమ్మరసం కలుపుకుని తాగే ముందు.. మామూలు నీళ్లతో నోటిని రెండుమూడుసార్లు పుక్కిలించిన తర్వాతే తాగాలి. లేదంటే బ్రెష్ చేసుకుని తాగితే ఇంకా మంచిది. లేకపోతే నోట్లోని బ్యాక్టీరియా పొట్టలోకి వెళ్లే ప్రమాదం ఉంది. 
 
చాలామంది జిమ్, జాగింగ్ వెళ్ళినప్పుడు దుకాణాల్లో బాటిళ్లలో విక్రయించే నిమ్మరసం తాగుతుంటారు. ఆరోగ్యానికి అది ఏమాత్రం మంచిది కాదు. ఇంట్లోనే సహజమైన నిమ్మకాయలను పిండుకున్న నీటిని తాగితేనే బెటర్. నీళ్లు నిమ్మరసంలోకి మోతాదుకు మించి తేనెను కలుపకూడదు. కొందరైతే వేడినీటి నీటిలోకి తేనెను కలిపేస్తుంటారు. ఈ అలవాటూ ఆరోగ్యకరమైనది కాదు.
తర్వాతి కథనం
కార్న్, చికెన్ గారెలు టేస్ట్ చేశారా?