సోమవారం, 23 డిశెంబరు 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By జె
Last Modified: గురువారం, 21 నవంబరు 2019 (22:19 IST)

ఆ సామర్థ్యాన్ని పెంచే టమోటా..?

టమోటాలో ఉండే లైకోపిన పురుషులలో సంతాన సామర్థ్యాన్ని పెంపొందిస్తుందంటున్నారు వైద్య నిపుణులు. ఆరోగ్యంగా ఉన్న పురుషులు రోజూ రెండు చెంచాల టొమోటా ప్యూరీ తీసుకుంటే వారిలో శుక్ర కణాల సంఖ్య పెరుగుతుందని ఇంగ్లాండ్ లోని షెఫీల్డ్ విశ్వవిద్యాలయం పరిశోధనలో వెల్లడైందట. 
 
విటమిన్ ఇ, జింక్ మాదిరిగానే లైకోపిన్ కూడా యాంటీ ఆక్సిడెంట్‌లా పనిచేస్తుందని నిపుణులు చెబుతున్నారు. ఇందు కోసం 60 మందిని ఎంపిక చేసి వారిలో కొందరికి రోజూ 14 మిల్లీ గ్రాముల లైకోపిన్ ఉన్న సప్లిమెంట్, మరికొందరికి లైకోపిన్ లేని డమ్మీ మాత్రలు ఇచ్చారు. ఈ ట్రయల్స్ ప్రారంభించక ముందు ఒకసారి, ఆరు వారాల తరువాత వారి శుక్ర కణాల సంఖ్యను పరీక్షించారు.
 
లైకోపిన్ సప్లిమెంట్ తీసుకున్న వారిలో ఈ కణాల్లో ఆరోగ్యకరమైన ఎదుగుదల, చలనశీలత బాగా మెరుగుపడడాన్ని పరిశోధనకు ముందు అనంతరం గుర్తించారు. కేవలం లైకోపిన్ సప్లిమెంట్ తీసుకున్నందు వల్లే ఈ మార్పు సాధ్యమైందని చెబుతున్నారు.