బంగారు నగలకు బదులు టమోటాలు ధరించిన వధువు
పాకిస్థాన్‌కు చెందిన ఓ వధువు బంగారు నగలకు బదులు టమోటాలను ధరించింది. పాకిస్థాన్‌లో టమోటాల దిగుమతికి నిషేధం విధించిన నేపథ్యంలో.. టమోటా ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. ఫలితంగా రూ.300లకు కేజీ టమోటాలను అమ్ముతున్నారు. దీంతో ప్రజలు ఇబ్బందులకు గురయ్యారు.
ఈ నేపథ్యంలో పాకిస్థాన్‌లో ఆర్థిక సంక్షోభం, టమోటా ధరలకు రెక్కలు వచ్చిన నేపథ్యంలో, ఆ దేశానికి చెందిన ఓ యువతి తన వివాహానికి టమోటాలనే ఆభరణాలుగా ధరించింది. మెడలో, చేతుల్లో టమోటాలను ధరించింది. ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అంతేగాకుండా వధువు టమోటాలను ఆభరణాలుగా ధరించిన వధువును ఇంటర్వ్యూ చేసిన వీడియోను ఓ ట్విట్టర్‌లో పోస్టు చేశాడు.
ఇంకా ఆ వధువుకు చుట్టుపక్కల వారు గంపెడు టమోటాలను కానుకగా ఇచ్చారు. ఇంటర్వ్యూలో వధువు మాట్లాడుతూ.. పసిడి ధరలు పెరిగాయి. వాటికి సమానంగా టమోటా ధరలు కూడా పెరిగాయి. అందుకే బంగారుకు బదులు టమోటాలను ధరించినట్లు చెప్పింది.