మంగళవారం, 26 నవంబరు 2024
  1. క్రీడలు
  2. ఇతర క్రీడలు
  3. వార్తలు
Written By
Last Modified: గురువారం, 19 సెప్టెంబరు 2019 (20:48 IST)

మైదానంలో ఆటగాళ్లపై పిడుగుపాటు... కూలిపోయారు...

వేల వోల్టుల విద్యుత్ శక్తితో మేఘాల నుంచి పడే పిడుగులను కొంతమంది లెక్కచేయరు. పిడుగులు పడుతున్నప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు చెప్పినా వినిపించుకోరు. అలా ఉరుములు, పిడుగులు పడుతున్నప్పటికీ పొలంలో పనులు చేస్తుంటారు కొందరు కూలీలు. ఐతే ఇలాంటి పట్టింపులేని ధోరణి ప్రాణాల మీదికి తెస్తోంది. ఏటా పిడుగుపాటుతో మృతి చెందుతున్నవారి సంఖ్య నమోదవుతూనే వుంది.
 
ఇక అసలు విషయానికి వస్తే... సోమవారంనాడు కింగ్‌స్టన్‌లోని ఈస్ట్ ఫీల్డ్ స్టేడియంలో వాల్మార్ బాయ్స్ స్కూల్, జమైకా కాలేజ్ క్రీడాకారుల మధ్య ఫుట్‌బాల్ పోటీలు నిర్వహించారు. ఆ సమయంలో చిరు జల్లులు మొదలయ్యాయి. కొద్దిసేపటికి పిడుగులు కూడా పడటం ప్రారంభమైంది. ఐతే ఆట చివర్లో వుండటంతో అది ముగించేసి వెళ్దామనుకుని ఆటగాళ్లు అలా ఆడుతూనే వున్నారు. 
 
ఇంతలో పెద్ద శబ్దం చేస్తూ ఆటగాళ్లపై పిడుగుపడింది. ముగ్గురు ఆటగాళ్లు కుప్పకూలారు. ఐతే ఇది గమనించని మిగిలిన ఆటగాళ్లు తమ ఆటను కొనసాగించారు. కానీ కిందపడ్డవారు ఆర్తనాదాలు చేస్తుండటంతో పరుగెత్తికెళ్లి చూడగా వారిలో ఇద్దరు పరిస్థితి విషమంగా మారింది. 
 
వెంటనే ఆసుపత్రికి తరలించగా వారిరువురూ గుండెపోటుకి గురైనట్లు తేలింది. ఇద్దరిలో ఒకరు కోలుకుంటూ వుండగా మరొకరి పరిస్థితి ఆందోళనకరంగా వున్నట్లు వైద్యులు తెలిపారు. చూడండి ఆ వీడియో...