కదులుతున్న కారులో వ్యభిచారం.. ఎక్కడ?
దేశంలోనే ప్రసిద్ధి గాంచిన ఆధ్మాత్మిక ప్రాంతం తిరుపతి కొంతమంది అసాంఘిక వ్యక్తులకు అడ్డాగా మారిపోయింది. డబ్బులను సంపాదించుకోవడానికి అడ్డదారులు తొక్కుతూ తిరుపతి లాంటి ప్రాంతాన్ని అడ్డాగా మార్చేసుకుంటున్నారు.
ఇప్పటివరకు నగరంలోని కొన్ని ప్రాంతాల్లో గుట్టుచప్పుడు కాకుండా వ్యభిచార గృహాలను నడిపేవారు కొంతమంది నిర్వాహకులు. అయితే పోలీసుల రైడింగ్ ఎక్కువైపోవడంతో బరితెగించేశారు. ఏకంగా కారులోనే వ్యభిచారాన్ని చేస్తూ పోలీసులకు అడ్డంగా దొరికిపోయారు.
ఎం.ఆర్.పల్లి పోలీసులు తిరుపతి - చిత్తూరు జాతీయ రహదారిపై వాహనాలను తనిఖీలు చేస్తున్నారు. వారానికి ఒకసారి వాహనాలను పోలీసులు యధావిధిగా తనిఖీలు చేస్తున్నారు. ఒక ఇన్నోవా కారులో ఐదుగురు పురుషులు, ఇద్దరు మహిళలు కనిపించారు. వారిని చూస్తే భక్తులలా కనిపించలేదు. దీంతో అనుమానంతో వారిని విచారించారు.
అందులో వైజాగ్‌కు చెందిన ఇద్దరు వ్యక్తులు కదిలే కారులో వ్యభిచారం చేసే బిజినెస్‌ను ప్రారంభించినట్లు పోలీసులకు తెలిపారు. ఇద్దరు మహిళలు వైజాగ్‌కు చెందిన వారే. దీంతో ముగ్గురు విటులను, ఇద్దరు నిర్వాహకులను అదుపులోకి తీసుకున్న పోలీసులు ఇద్దరు మహిళలకు కౌన్సిలింగ్ ఇచ్చి వదిలేశారు. ఇన్నోవా కారుతో పాటు మూడు సెల్ ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.