ఈ జీడిపప్పు ఆరోగ్య రహస్యాలు తెలుసుకోవాల్సిందే (video)
ఆరోగ్యానికి ఎండు గింజలు బాగా మేలు చేస్తాయి. వాటిలో జీడిపప్పుది ప్రత్యేకం. జీడిపప్పుతో దేహానికి శక్తి లభిస్తుంది. అలాగే గుండెను పదిలంగా ఉంచుతుంది. వందగ్రాముల జీడిపప్పులో 553 కేలరీలు, 30 గ్రాముల కార్బొహైడ్రేట్లు, 18 గ్రాముల ప్రోటీన్‌లు, 43 గ్రాముల కొవ్వు, మూడు గ్రాముల పీచు ఉంటాయి. వీటితో పాటుగా విటమిన్‌లు, సోడియం, పొటాషియం, ఖనిజలవణాలూ ఉంటాయి.
జీడిపప్పుసో ఒలెయిక్, పామిటోలెయిక్ వంటి మోనో అన్ సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్‌లు ఉంటాయి. ఇవి దేహానికి హాని చేసే కొలెస్ట్రాల్ (ఎల్‌డిఎల్) స్థాయులను తగ్గించి, మంచి కొలెస్ట్రాల్ (హెచ్‌డిఎల్) స్థాయులను పెంచుతుంది. కాబట్టి ఇవి గుండెకు మేలు చేస్తాయి.
జీడిపప్పులో మాంగనీస్, పొటాషియం, కాపర్, ఐరన్, మెగ్నీషియం, జింకు, సెలెనియం వంటి సూక్ష్మ పోషకాలు పుష్కలంగా ఉంటాయి. కాబట్టి రోజుకు గుప్పెడు జీడిపప్పు తీసుకుంటే పోషకాల లోపంతో వచ్చే వ్యాధులను నివారించవచ్చు. అలాగే చర్మంపై ముడతలు, వృద్ధాప్య ఛాయలను నియంత్రించుకోవచ్చు.