1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
  4. papaya health benefits for pregnant womens

గర్భిణీలు బొప్పాయిను తీసుకుంటే? ఆరోగ్యానికి?

బొప్పాయిలో కెరోటిన్ అత్యధికంగా ఉంటుంది. కెరోటిన్‌, ఎ, బి, సి, ఇ విటమిన్స్, ఖనిజాలు, ఫ్లేవొనాయిడ్‌లు, ఫొలేట్‌లు, పాంతోనిక్‌ ఆమ్లాలు, పీచు వంటి పోషకాలు ఇందులో పుష్కలంగా ఉంటాయి. మామిడి పండు తర్వాత బొప్పా

Diabetes
బొప్పాయిలో కెరోటిన్ అత్యధికంగా ఉంటుంది. కెరోటిన్‌, ఎ, బి, సి, ఇ విటమిన్స్, ఖనిజాలు, ఫ్లేవొనాయిడ్‌లు, ఫొలేట్‌లు, పాంతోనిక్‌ ఆమ్లాలు, పీచు వంటి పోషకాలు ఇందులో పుష్కలంగా ఉంటాయి. మామిడి పండు తర్వాత బొప్పాయిలోనే మనకు అధిక పరిమాణంలో విటమిన్ ఎ లభిస్తుంది. దీనితోపాటు బి1, బి2, బి3, సి-విటమిన్లు, క్యాల్షియం, ఇనుము, భాస్వరం వంటి ఖనిజ లవణాలు బొప్పాయిలో సమృద్ధిగా లభిస్తాయి.ఇన్ని సుగుణాలున్న బొప్పాయి పండు వల్ల ఇతర ఆరోగ్యప్రయోజనాలేంటో తెలుసుకుందాం. 
 
పెరడులో, ముంగిట్లో, తోటల్లో విస్తృతంగా లభించే బొప్పాయి శరీరాన్ని అదుపులో ఉంచే అద్భుత ఔషధంగా పనిచేస్తుంది. ఈ పళ్లు వేడి చేస్తాయి కనుక గర్భవతులకు ఆరోగ్యానికి చాలా మంచిది. ఇందులోని పోషకతత్వాల వలన గర్భిణీలకే కాకుండా గర్భస్థశిశువుకు కూడా చాలా మంచిది. కనుక అందరూ నిర్భయంగా మిగిలిన అన్ని పండ్లనేకాకుండా బొప్పాయిని తీసుకుంటే మంచిది.
 
ఇందులో చక్కెర శాతం తక్కువ కనుక కొందరికి రుచించదు. కానీ మధుమేహ వ్యాధిగ్రస్తులు బొప్పాయాను ఆదర్శ భోజనంగా తీసుకుంటే వారికి ఇది ఒక మంచి ఆహారంగా ఉపయోగపడుతుంది. స్థూలకాయాన్ని తగ్గించేందుకు బొప్పాయి చాలా సహాయపడుతుంది. బొప్పాయిలో పాపైన్ అనే పేరున్న ఈ ఎంజైమ్ వలన జీర్ణవ్యవస్థకు మేలు జరుగుతుంది.
About Writer
Kowsalya
దేవీ (మురళీకృష్ణ)  నిక్‌నేమ్- శక్తిమాన్ సినిమా రంగంలో దాదాపు 26 ఏళ్ల అనుభవం ఉంది. కళారంగంపై ఇంట్రెస్టుతో రిపోర్టర్‌గా కెరీర్ మొదలైంది. అలా చేస్తూనే విజయవాడలో రంగస్థలంపై నాటకాల్లో పాత్రలు పోషించారు. అలా ఆర్టిస్టుగా.. పలు సినిమాలు, సీరియల్స్‌లో సైతం నటించారు. స్క్రిప్ట్ వర్క్‌లో కూడా కొద్దికాలం చేశారు. అలా ప్రజాశక్తి దినపత్రికలో సినిమా పేజీ న్యూస్ రిపోర్టర్‌గా తనతోనే ఆరంభం అయింది. అలా చేస్తుండగానే మెగాస్టార్ చిరంజీవి గారితో ఇంటర్వ్యూ చేశాక...... మరింత చదవండి
తర్వాతి కథనం
వర్షాకాలంలో మాంసాహారాన్ని ఇలా తీసుకుంటే?