1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
  4. jaggery health benefits with milk

పాలలో బెల్లం కలిపి తీసుకుంటే?

బెల్లం కలిపిన టీ, కాఫీ, పాలు త్రాగితే ఎముకలు, కండరాలు దృఢంగా ఉంటాయి. బెల్లం కలిపిన పాలు త్రాగడం ఆరోగ్యానికి మంచిది. జీర్ణ సంబంధిత సమస్యలు ఉంటే పాలల్లో కాస్త బెల్లం వేసుకుని త్రాగితే వెంటనే ఉపశమనం లభిస

jaggery
బెల్లం కలిపిన టీ, కాఫీ, పాలు త్రాగితే ఎముకలు, కండరాలు దృఢంగా ఉంటాయి. బెల్లం కలిపిన పాలు త్రాగడం ఆరోగ్యానికి మంచిది. జీర్ణ సంబంధిత సమస్యలు ఉంటే పాలల్లో కాస్త బెల్లం వేసుకుని త్రాగితే వెంటనే ఉపశమనం లభిస్తుంది. ఒత్తిడిని దూరం చేసుకోవాలంటే బెల్లం కలిపిన పాలను తీసుకోవడంతో ఉపశమనం పొందవచ్చును.
 
బాగా ఆడుకునే పిల్లలకు బెల్లం పాలు ఇస్తే తక్షణ శక్తి, ఉత్సాహంగా ఉంటారు. రోజూ పాలు త్రాగడం వలన క్యాల్షియం పెరిగి ఎముకలు బలంగా మారతాయి. కీళ్ల నొప్పులు, కండరాల నొప్పులు తగ్గుతాయి. బెల్లం శరీరంలోని రక్తాన్ని శుద్ధి చేస్తుంది. జుట్టును రాలనీయకుండా చేస్తుంది. నెలసరి నొప్పులను దూరం చేసుకోవాలంటే పాలలో బెల్లం కలుపుకుని త్రాగాలి. బెల్లం పాలు తాగితే హీమోగ్లోబిన్‌ శాతం పెరుగుతుంది. జలుబు, దగ్గుతో బాధపడుతున్నప్పుడు బెల్లం కలిపిన పాలు ఉపశమనాన్నిస్తుంది. 
 
పొడి దగ్గుతో ఇబ్బంది పడుతున్నప్పుడు గ్లాసు బెల్లం పానకంలో కొద్దిగా తులసీ ఆకులు వేసి రోజుకు మూడుసార్లు తీసుకుంటే మంచిది. బెల్లం, నెయ్యి సమపాళ్ళల్లో కలిపి తింటే మైగ్రేయిన్‌ తలనొప్పి తగ్గుతుంది. బెల్లం వల్ల కీళ్ళ ఇబ్బందులు రావని, శరీర రక్తంలోని చక్కెర స్థాయిలను నియంత్రించుకోవచ్చునని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. 
About Writer
Kowsalya
దేవీ (మురళీకృష్ణ)  నిక్‌నేమ్- శక్తిమాన్ సినిమా రంగంలో దాదాపు 26 ఏళ్ల అనుభవం ఉంది. కళారంగంపై ఇంట్రెస్టుతో రిపోర్టర్‌గా కెరీర్ మొదలైంది. అలా చేస్తూనే విజయవాడలో రంగస్థలంపై నాటకాల్లో పాత్రలు పోషించారు. అలా ఆర్టిస్టుగా.. పలు సినిమాలు, సీరియల్స్‌లో సైతం నటించారు. స్క్రిప్ట్ వర్క్‌లో కూడా కొద్దికాలం చేశారు. అలా ప్రజాశక్తి దినపత్రికలో సినిమా పేజీ న్యూస్ రిపోర్టర్‌గా తనతోనే ఆరంభం అయింది. అలా చేస్తుండగానే మెగాస్టార్ చిరంజీవి గారితో ఇంటర్వ్యూ చేశాక...... మరింత చదవండి
తర్వాతి కథనం
సమ్మర్ స్పెషల్... అవకాయ పచ్చడి తయారీ విధానం...