శుక్రవారం, 22 నవంబరు 2024
  1. ఇతరాలు
  2. వంటకాలు
  3. భారతీయ
Written By Kowsalya
Last Updated : శుక్రవారం, 8 జూన్ 2018 (13:21 IST)

సమ్మర్ స్పెషల్... అవకాయ పచ్చడి తయారీ విధానం...

మామిడికాయలు సాధారణంగా వేసవిలో తయారవుతాయి. ఆకుపచ్చని మామిడికాయలు, వేడి నూనె, మిరపకాయలు, కొన్ని సుగంధ ద్రవ్యాల రకాలు, కీలకమైన పదార్థాలతో దీనిని తయారు చేస్తారు. తయారీ, నిల్వ అందిస్తున్న ప్రక్రియ దాదాపుగా

మామిడికాయలు సాధారణంగా వేసవిలో తయారవుతాయి. ఆకుపచ్చని మామిడికాయలు, వేడి నూనె, మిరపకాయలు, కొన్ని సుగంధ ద్రవ్యాల రకాలు, కీలకమైన పదార్థాలతో దీనిని తయారు చేస్తారు. తయారీ, నిల్వ అందిస్తున్న ప్రక్రియ దాదాపుగా ఒక సంప్రదాయంగా పరిగణించబడుతుంది.
 
కావలసిన పదార్థాలు: 
మామిడికాయలు - 6
కారం - 200 గ్రాములు
ఉప్పు - 200 గ్రాములు
పసుపు - 2 స్పూన్స్
మెంతులు - 25 గ్రాములు
నువ్వుల నూనె - 1/2 కిలో
శనగలు - కొన్ని
ఆవపిండి - కొద్దిగా
 
తయారీ విధానం:
ముందుగా మామిడికాయలను శుభ్రంగా కడిగి తడి లేకుండా తుడిచి పెద్ద ముక్కలుగా కోసుకోవాలి. ఈ ముక్కలను పొడి బట్టతో తుడిచి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక పెద్ద వెడల్పాటి బేసిన్ లేదా పళ్ళెం తీసుకొని దానిలో పైన చెప్పుకున్న కొలతలకు అనుగుణంగా ఆవపిండి, కారం, పసుపు, మెంతులు, చిన్న శనగలు వేసి అన్నీ కలిసేలా కలుపుకోవాలి. ఉప్పు మాత్రం అంతా ఒక్కసారే వేసుకోకుండా కొద్దిగా తగ్గించి వేసుకొని తరువాత రుచి చూసి తక్కువైతే వేసుకోవచ్చును.
 
ఈ మిశ్రమానికి తరిగిన మామిడి ముక్కలు కలిపి దాని మీద కొద్దిగా నూనె వేసుకుని కలిపి కొద్దిగా తడి పొడి అయ్యేటట్లు కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని తడిలేని ఒక జాడీలో వేసి పెట్టుకోవాలి. కారం మిశ్రమం, పొడిలో కలిపిన మామిడి ముక్కలు జాడీలో పొరలు పొరలుగా వేసుకోవాలి. ఆ తరువాత జాడీలో పైఅంగుళం వరకూ నూనెను పోసుకోవాలి.
 
పొడి బట్టతో జాడీకి మూతను సరిగా పెట్టి మూతిని గట్టిగా కట్టేసుకోవాలి. ఈ జాడీని నీళ్లు, తేమ లేని వంటగదిలో శుభ్రంగా ఉన్న ఒక చోట పెట్టాలి. మూడు రోజుల తరువాత బాగా ఊట వస్తుంది. జాడీలోని ఆవకాయను ఒక పెద్ద పళ్లెంలోకి తీసుకొని బాగా పెద్ద గరిటతో కలుపుకోవాలి. అంతే ఆవకాయ పచ్చడి రెడీ.