గురువారం, 23 జనవరి 2025
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. పంచాంగం
Written By Kowsalya
Last Updated : గురువారం, 7 జూన్ 2018 (18:18 IST)

మహిళలు ఉంగరాలను చూపుడు వేలికి పెట్టుకుంటే?

మహిళలు ఎన్ని రకాలుగా అలంకరించుకున్నా బొట్టు పెట్టుకుంటేనే వాళ్ళకు నిండుదనం వస్తుంది. మహిళల శరీరంలోని రకరకాల అవయవాలకు, అంగాలకు ఒక్కో దేవత లేక దేవుడు అధిపతులుగా ఉంటారు. నుదుటికి బ్రహ్మదేవుడు అధిపతిగా ఉం

మహిళలు ఎన్ని రకాలుగా అలంకరించుకున్నా బొట్టు పెట్టుకుంటేనే వాళ్ళకు నిండుదనం వస్తుంది. మహిళల శరీరంలోని రకరకాల అవయవాలకు, అంగాలకు ఒక్కో దేవత లేక దేవుడు అధిపతులుగా ఉంటారు. నుదుటికి బ్రహ్మదేవుడు అధిపతిగా ఉంటాడు. బ్రహ్మదేవుడికి ఇష్టమైన రంగు ఎరుపు. అందుకే బ్రహ్మకు ఇష్టమైన ఎరుపు రంగు బొట్టును మహిళలు పెట్టుకుంటుంటారు. 
 
అలాగే నుదుటి ప్రాంతాన్ని సూర్యకిరణాలు అస్సలు తాకకూడదు. అందుకోసం కూడా నుదుటిన బొట్టు పెట్టుకోవాలని అంటారు. కానీ ఈ రోజుల్లో ఫ్యాషన్ పేరిట కుంకుమను పెట్టుకోకుండా ప్లాస్టిక్ బొట్టులను పెట్టుకుంటున్నారు. అలాచేయడం వలన దాంపత్య జీవితంలో కలహాలు వస్తున్నాయంటున్నారు జ్యోతిష్య నిపుణులు.  
 
ఉంగరపు వేలితో కుంకుమను పెట్టుకుంటే మానసిక ప్రశాంతత, శాంతి లభిస్తుందని నిపుణులు చెబుతున్నారు. ఇకపోతే ఉంగరాన్ని మధ్య వేలికి పెట్టుకుంటే ఆయుష్షు వృద్ధి చెందుతుంది. బొటను వేలికు పెట్టుకుంటే అనూహ్యమైన శక్తి లభిస్తుంది. చూపుడు వేలికి పెట్టుకుంటే చెడు అలవాట్లన్నీ సమసిపోయి ఆధ్మాత్మిక చింతనతో ఉంటారు.