బుధవారం, 6 నవంబరు 2024
  1. ఇతరాలు
  2. వంటకాలు
  3. చిట్కాలు
Written By Kowsalya
Last Updated : బుధవారం, 6 జూన్ 2018 (18:50 IST)

సమ్మర్ స్పెషల్... బెండకాయ పచ్చడి తయారీ విధానం...

బెండకాయలో విటమిన్స్, ఖనిజాలు, పీచు మాత్రం పుష్కలంగా దొరుకుతుందని పోషక నిపుణులు పేర్కొన్నారు. బెండకాయలను ఆహారంలో భాగంగా తీసుకోవడం వల్ల వీటిల్లో దొరికే లెక్టిన్ అనే ప్రొటీన్ రొమ్ము క్యాన్సర్ వచ్చే ప్రమా

బెండకాయలో విటమిన్స్, ఖనిజాలు, పీచు మాత్రం పుష్కలంగా దొరుకుతుందని పోషక నిపుణులు పేర్కొన్నారు. బెండకాయలను ఆహారంలో భాగంగా తీసుకోవడం వల్ల వీటిల్లో దొరికే లెక్టిన్ అనే ప్రొటీన్ రొమ్ము క్యాన్సర్ వచ్చే ప్రమాదాన్ని తగ్గిస్తుంది. బెండలోని ఫోలేట్లు అనేక రకాల క్యాన్సర్లను అడ్డుకుంటాయి. ఫోలేట్ లోపం వల్ల రొమ్ము, మెడ, క్లోమ, ఊపిరితిత్తుల క్యాన్సర్లు వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉందని నిపుణులు చెబుతున్నారు. ఇలాంటి వ్యాధుల నుండి తప్పించుకోవాలంటే ఈ వంటకాన్ని తీసుకుంటే మంచిది. 
 
బెండకాయలు - పావు కిలో 
ఎండుమిరప కాయలు - పది
నిమ్మకాయ - 1
చింతపండు - సరిపడా
పసుపు - చిటికెడు
ఇంగువ - చిటికెడు 
పోపు దినుసులు - 3 స్పూన్స్ 
 
తయారీ విధానం : 
ముందుగా బెండకాయల్ని శుభ్రం చేసుకుని ఆరబెట్టి ముక్కలుగా తరిగి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు బాణలిలో నూనెను పోసి వేడయ్యాక బెండకాయ ముక్కల్ని వేసి వేయించాలి. బాగా వేగాక ఆ బాణలిని స్టౌవ్‌మీద నుంచి దించి పక్కన పెట్టుకోవాలి.

మరో బాణలిలో నూనెను పోసి బాగా కాగాక అందులో పోపు దినుసులు, ఎండుమిరపకాయలు, పసుపు, ఉప్పు వేసి వేయించి తీసి కాసేపు ఆరబెట్టిన తరువాత రోట్లో వేసి దంచుకోవాలి. దీనికి చింతపండును కలిపి నూరి, ఆపై వేయించిన బెండకాయ ముక్కల్ని కూడా కలిపి దంచాలి. తరువాత నూరిన పచ్చడిని తీసి పోపు పెట్టుకోవాలి. అంతే ఘమఘమలాగే బెండకాయపచ్చడి రెడీ.