1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
  4. What are the benefits of dates for 8 problems

8 సమస్యలకు ఖర్జూరాలతో ప్రయోజనం, ఏంటవి?

Benefits Of Dates With Milk At Night
ఖర్జూరాలు. వీటిని రాత్రిపూట పాలతో కలిపి తినడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. కండరాల శక్తిని పెంపొందించడం, శక్తి స్థాయిలు పునరుద్ధరించడం, రక్తహీనత చికిత్స వంటి ప్రయోజనాలతో పాటు ఇంకా ఏమేమి వున్నాయో తెలుసుకుందాము.
 
రుతుక్రమం: ఖర్జూరం తినడం వల్ల బహిష్టు సమయంలో వెన్నునొప్పి నుంచి ఉపశమనం లభిస్తుంది.
 
బెడ్‌వెట్టింగ్: పిల్లలు నిద్రలో మూత్ర విసర్జన చేస్తుంటే ఖర్జూరంతో పాటు పాలు ఇవ్వండి.
 
రక్తపోటు: ఖర్జూరంతో కాచిన పాలను ఉదయం, సాయంత్రం త్రాగితే కొద్ది రోజుల్లోనే తక్కువ రక్తపోటు నుండి బైటపడతారు.
 
మలబద్ధకం: ఉదయం, సాయంత్రం మూడు ఖర్జూరాలు తిన్న తర్వాత గోరువెచ్చని నీటిని తాగడం వల్ల మలబద్ధకం నుండి ఉపశమనం లభిస్తుంది.
 
మధుమేహం: తీపి పదార్థాలు, చక్కెర మొదలైనవి నిషేధించబడిన మధుమేహ రోగులు పరిమిత పరిమాణంలో ఖర్జూరం పాయసం తీసుకోవచ్చు.
 
గాయాలు: ఖర్జూరపు ముద్దలను కాల్చి బూడిద చేయండి. ఈ భస్మాన్ని గాయాలపై పూస్తే గాయాలు మానుతాయి.
 
దగ్గు : ఎండు ఖర్జూరాలను నెయ్యిలో వేయించి రోజుకు 2-3 సార్లు తీసుకుంటే దగ్గు నుండి ఉపశమనం కలుగుతుంది.
 
పేను: ఖర్జూరపు పొడిని నీళ్లలో నూరి తలకు పట్టించడం వల్ల తలలోని పేను నశిస్తుంది.
About Writer
సిహెచ్
తర్వాతి కథనం
మునగ కాయలు, ఆకులు తింటే 9 ఉపయోగాలు, ఏంటవి?