ఆదివారం, 22 డిశెంబరు 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By సిహెచ్
Last Modified: సోమవారం, 22 జనవరి 2024 (20:28 IST)

హిమోగ్లోబిన్ లోపం వుంటే శరీరంలో కనిపించే లక్షణాలు ఏమిటి?

hemoglobin
శరీరంలోని 70 శాతం ఐరన్ హిమోగ్లోబిన్‌లో ఉంటుంది. అయితే చాలా మంది, ముఖ్యంగా మహిళలు హిమోగ్లోబిన్ లోపంతో బాధపడుతున్నారు. హిమోగ్లోబిన్ శాతం పడిపోతే దాని లక్షణాలు ఎలా వుంటాయో తెలుసుకుందాము.  హిమోగ్లోబిన్ లేకపోవడం వల్ల త్వరగా అలసిపోవడం మొదలవుతుంది.
 
చర్మం పసుపు రంగులోకి మారడం కూడా హిమోగ్లోబిన్ లక్షణాలలో ఒకటి. హిమోగ్లోబిన్ లోపం వల్ల శ్వాస తీసుకోవడంలో సమస్యలు వస్తాయి. ఇనుము లోపం వల్ల మగత, చిరాకు కలిగిస్తుంది. హిమోగ్లోబిన్ లేకపోవడం వల్ల, వ్యక్తి నిరాశకు గురైనట్లు తయారవుతాడు.
 
చేతులు, కాళ్లు తరచుగా చల్లగా మారిపోవడం కూడా హిమోగ్లోబిన్ లోపం యొక్క లక్షణం. నడుస్తున్నప్పుడు, నిలబడినప్పుడు కళ్లు తిరగడం వంటివి కూడా హిమోగ్లోబిన్ లోపానికి సంకేతం.