బుధవారం, 4 డిశెంబరు 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By సిహెచ్
Last Modified: మంగళవారం, 31 అక్టోబరు 2023 (17:49 IST)

శరీరాన్ని శక్తివంతంగా చేసే ఐరన్ రిచ్ డ్రింక్స్ లిస్ట్ ఇదే

శరీరంలో రక్త ప్రసరణను పెంచి మనల్ని చురుకుగా ఉంచేది ఐరన్. పండ్లు, కూరగాయలతో తయారుచేసిన పానీయాలలో ఐరన్ పుష్కలంగా ఉంటుంది. అవేమిటో తెలుసుకుందాము. ఎండిన రేగు పండ్ల నుండి తయారైన ప్రూనే జ్యూస్‌లో రోజువారీ అవసరాలలో 17 శాతం ఇనుము ఉంటుంది. ఇది శరీరాన్ని చురుకుగా చేస్తుంది. బీట్‌రూట్ రసంలో మాంగనీస్, ఐరన్, విటమిన్ సిలు ఎర్ర రక్త కణాలకవసరమైన ఆక్సిజన్ వినియోగాన్ని పెంచుతాయి.
 
గుమ్మడికాయ రసంలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు, మినరల్స్ శరీరానికి రోజుకి కావాల్సిన పోషకాలను అందిస్తాయి. నిమ్మకాయ, కొత్తిమీర, బచ్చలికూర, దోసకాయలను కలిపి తయారుచేసిన గ్రీన్ జ్యూస్ శరీరానికి అవసరమైన ఐరన్‌ను అందిస్తుంది. బచ్చలికూరను పైనాపిల్‌తో గ్రైండ్ చేసి తయారుచేసే రసంలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది.
 
ఖర్జూరం, దానిమ్మలతో చేసిన పానీయం శరీరానికి ఇనుమును అందిస్తుంది. పాలు, తేనె, నువ్వులను కలిపి పానీయంగా తీసుకుంటే రక్తంలో హిమోగ్లోబిన్ పెరుగుతుంది. ఎముకలు బలపడతాయి.