మంగళవారం, 23 జులై 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By సిహెచ్
Last Modified: శుక్రవారం, 27 అక్టోబరు 2023 (20:35 IST)

పురుషులు పొద్దుతిరుగుడు విత్తనాలు తింటే అద్భుతమైన శక్తి

పొద్దు తిరుగుడు పువ్వు విత్తనాలు. ఇవి ఆరోగ్యానికి ఎంతగానో మేలు చేస్తాయి. వీటిలో శరీరానికి అవసరమైన క్యాలరీలతో పాటు ముఖ్యమైన మినరల్స్, ఫ్యాటీ ఆసిడ్స్ వున్నాయి. వీటితో శరీరానికి కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాము. పొద్దు తిరుగుడు విత్తనాల్లో వున్న ఫైబర్ కంటెంట్ చెడు కొలెస్ట్రాల్ తగ్గించేందుకు దోహదపడుతుంది. ఈ విత్తనాల్లోని విటమిన్ సి గుండె జబ్బులు రాకుండా అడ్డుకుంటుంది.
 
శరీరంలోని వ్యర్థమైన మలినాలను అడ్డుకుని కాపాడే శక్తి వీటికి వుంది. పురుషులు పొద్దుతిరుగుడు విత్తనాలు తింటే అద్భుతమైన శక్తి కలుగుతుంది. బ్రెస్ట్ కేన్సర్, ప్రొస్టేట్ కేన్సర్, కొలన్ కేన్సర్ రాకుండా ఇవి నిరోధించగలవు.
 
పొద్దు తిరుగుడు విత్తనాలు తీసుకునేవారిలో ఒత్తిడి స్థాయిలు తగ్గుతాయి. జలుబు, దగ్గుతో బాధపడేవారు పొద్దుతిరుగుడు పువ్వు విత్తనాలు తీసుకుంటే ఫలితం వుంటుంది. చర్మం కాంతివంతంగా మెరిసిపోవాలంటే పొద్దుతిరుగుడు పువ్వు విత్తనాలు తింటుండాలి.