సంబంధిత వార్తలు
- రాజకీయాల్లోకి అడుగుపెట్టాల్సిన స్థితికి వచ్చాయి : రాఘవ లారెన్స్
- కర్ణాటకలో పెరుగుతున్న హెచ్ఐవి కేసులు: 417 కొత్త కేసులు నమోదు
- రాజా ది రాజా నుంచి యూత్ ఫుల్ మెలోడీ తుఝ్‌పే ఫిదా సాంగ్
- దిగ్గజ దర్శకుడు భారతీరాజా పార్థివదేహానికి సినీ ప్రముఖుల నివాళులు
- సీఎం విజయ్ కేబినెట్ మహిళా మంత్రిపై యూట్యూబర్ మారిదాస్ అసభ్యకర వీడియో?: అతడు బైటకు రావడం కష్టమేనా?
15న విజయ్ - సంగీత విడాకుల కేసు విచారణ
తమిళనాడు ముఖ్యమంత్రి, టీవీకే అధ్యక్షుడు విజయ్, సంగీత దంపతుల విడాకుల కేసు విచారణ ఈ నెల 15వ తేదీన జరుగనుంది. చెన్నై చెంగల్పట్టు కుటుంబ సంక్షేమ కోర్టులో ఈ కేసు విచారణ జరుగనుంది. తమిళనాడు రాష్ట్రంలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో టీవీకే అధ్యక్షుడు విజయ్‌కు చెందిన టీవీకే పార్టీ విజయం సాధించింది. ఫలితంగా ముఖ్యమంత్రిగా విజయ్ బాధ్యతలు చేపట్టారు. అయితే, విజయ్ నుంచి విడాకులు కోరుతూ ఆయన సతీమణి సంగీత దాఖలు చేసిన విడాకుల పిటిషన్‌పై ఇప్పటికే పలు దఫాలుగా విచారణ జరిగింది. ఈ నేపథ్యంలో ఈ నెల 15వ తేదీన ఈ కేసుపై కీలక విచారణ జరుగనుంది.
ఈ కేసు విచారణకు స్వీకరించిన నేపథ్యంలో ముఖ్యమంత్రి విజయ్ కోర్టుకు హాజరయ్యే అవకాశం లేదని ఆయన తరపున చెబుతుండగా, సంగీత హాజరయ్యే అవకాశముందని ఆమె తరపున తెలియజేశారు. అదే సమయంలో ఇద్దరు తమతమ న్యాయవాదుల సమక్షంలో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా హాజయ్యే అవకాశముందని సమాచారం.
