షవర్మా సైడ్ ఎఫెక్ట్స్, తింటే ఏం చేస్తుందో తెలుసా?
షవర్మా. ఇటీవలి కాలంలో ఈ వంటకం పేరు ఎక్కువగా వినబడుతోంది. దీనికి కారణం ఈ పదార్థాన్ని తిని పలువురు అస్వస్థతకు గురవడం, ఇంకొందరు ప్రాణాలనే కోల్పోవడం జరుగుతోంది. షవర్మా తింటే కలిగే దుష్ప్రభావాలు ఏమిటో తెలుసుకుందాము. షవర్మా అనారోగ్యకర ఫ్యాటీ యాసిడ్లతో నిండి వుండి రక్తంలో చెడు కొలెస్ట్రాల్‌ను తెచ్చిపెడుతుంది. షవర్మా తినడం వల్ల గుండెపోటు వచ్చే ప్రమాదం వుంటుంది.
షవర్మాలో అత్యధిక క్యాలరీలు వుండటం వల్ల అధిక బరువు పెరిగేందుకు కారణమవుతుంది. షవర్మా తయారీ దాదాపు ఆరోగ్యకర రీతిలో జరగదు, ప్రత్యేకించి ప్యాకేజింగ్ సమయంలో అది విషతుల్యమవుతుంటుంది.
షవర్మ తినడం వల్ల కొందరిలో వాంతులు, వికారం, డయారియా, కడుపు నొప్పి రావచ్చు. మధుమేహ వ్యాధిగ్రస్తులు షవర్మా తింటే బ్లడ్ షుగర్ స్థాయిలు అమాంతం పెరిగిపోతాయి.