1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. వార్తలు
  4. Daily Almond Consumption May Help Improve Perceived Sleep Quality Among Adults

రోజూ బాదం పప్పు తినడం వల్ల పెద్దల్లో మెరుగైన నిద్ర నాణ్యత

Almonds
ఆల్మండ్ బోర్డ్ ఆఫ్ కాలిఫోర్నియా నిధులు సమకూర్చిన కొత్త పరిశోధనలో, సరిగ్గా నిద్రపట్టని భారతీయ పెద్దలు 20 వారాల పాటు రోజూ బాదం తినడం వల్ల మెరుగైన నిద్ర నాణ్యత, అధిక నిద్రా సామర్థ్యంతో పాటు త్వరగా నిద్రలోకి జారుకున్నట్లు స్వయంగా వెల్లడించారు
 
సరిగ్గా నిద్రపట్టని భారతీయ పెద్దలపై జరిపిన ఒక కొత్త రాండమైజ్డ్ కంట్రోల్డ్ ట్రయల్, ప్రతిరోజూ బాదం తినడం వల్ల వారి నిద్ర నాణ్యత మెరుగుపడుతుందని కనుగొంది. నిద్ర ఆరోగ్యాన్ని పెంపొందించడంలో ఆహారానికి ప్రాధాన్యతనిచ్చే విస్తృత విధానంలో బాదం యొక్క పాత్రపై ఇది కొత్త అంతర్దృష్టిని అందిస్తోంది.
 
'ఫ్రాంటియర్స్ ఇన్ న్యూట్రిషన్' (దేశాయ్ తదితరులు, 2026) లో ప్రచురితమైన ఈ పరిశోధనను, సరిగ్గా నిద్రపట్టడం లేదని నివేదించిన 21-55 సంవత్సరాల మధ్య వయస్సు గల 175 మంది భారతీయ పెద్దలపై నిర్వహించారు. ఈ అధ్యయనంలో పాల్గొన్న వారికి 60 గ్రాముల బాదం పప్పులను (సుమారు 50 బాదం పప్పులు) లేదా దానికి సమానమైన కేలరీలు ఉండే ఖాక్రా, చివ్డా మరియు క్రాకర్స్ వంటి అల్పాహారాన్ని అందించారు.
 
ముఖ్యాంశాలు¹
రోజూ బాదం తినడం కింది ప్రయోజనాలతో ముడిపడి ఉంది:
స్వయంగా వెల్లడించిన మెరుగైన మొత్తం నిద్ర నాణ్యత
అధిక నిద్రా సామర్థ్యం, పాల్గొన్న వారు పడకపై ఎక్కువ సమయం నిద్రలోనే గడిపారు
నిద్రలోకి జారుకోవడానికి తీసుకునే సమయం తగ్గడం.
రాత్రిపూట మధ్యలో మెలకువ వచ్చే సమయం తగ్గినట్లుగా కొన్ని ప్రోత్సాహకరమైన సంకేతాలు కనిపించాయి, అయితే ఈ ఫలితాలు అధ్యయన జనాభా అంతటా ఒకేలా లేవు.
 
బాదం పప్పులు ఎలా సహాయపడతాయి?
సాధారణ నాడీ వ్యవస్థ పనితీరుకు, మొత్తం ఆరోగ్యానికి జీవశాస్త్రపరంగా అవసరమైన మెగ్నీషియం, ట్రిప్టోఫాన్ వంటి అనేక పోషకాలు బాదంలో ఉంటాయి. మెగ్నీషియం సాధారణ నాడీ వ్యవస్థ, కండరాల పనితీరులో పాలుపంచుకుంటుంది. కాగా, సెరోటోనిన్ మరియు మెలటోనిన్‌లను ఉత్పత్తి చేయడానికి శరీరం ట్రిప్టోఫాన్‌ను ఉపయోగిస్తుంది. బాదంలో సహజంగానే తక్కువ మొత్తంలో మెలటోనిన్‌తో పాటు ఆరోగ్యకరమైన అసంతృప్త కొవ్వులు, యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి.
 
ఈ అధ్యయనంలో కనుగొన్న మరికొన్ని అంశాలు ఏమిటి?
కంట్రోల్ స్నాక్ తీసుకున్న వారితో పోలిస్తే రోజూ బాదం తినే వారి నిద్రలో అనేక మెరుగుదలలు ఉన్నట్లు వెల్లడైంది. మెరుగైన మొత్తం నిద్ర నాణ్యత, పెరిగిన నిద్రా సామర్థ్యం, త్వరగా నిద్రలోకి జారుకోవడం వంటివి ఇందులో ఉన్నాయి.
 
ఈ పరిశోధన ఫలితాలు పోషకాహారానికి, నిద్రకు మధ్య ఉన్న సంబంధాన్ని విశ్లేషించే విస్తృత ఆధారాలకు మరింత బలాన్ని చేకూరుస్తున్నాయి. ఆరోగ్యకరమైన జీవనశైలిలో భాగంగా మెరుగైన నిద్ర నాణ్యతను అందించడంలో బాదం ముఖ్య పాత్ర పోషిస్తుందని ఇవి సూచిస్తున్నాయి.
 
ఈ అధ్యయన ఫలితాలపై న్యూట్రిషన్ అండ్ వెల్నెస్ కన్సల్టెంట్ షీలా కృష్ణస్వామి మాట్లాడుతూ, “మన మొత్తం ఆరోగ్యానికి నిద్ర ఒక ముఖ్యమైన భాగం. ఆరోగ్యకరమైన జీవనశైలిలో పోషకాహారం కూడా కీలక పాత్ర పోషిస్తుంది. నిద్ర నాణ్యత లోపంతో బాధపడుతున్న పెద్దలు రోజూ బాదం తినడం వల్ల నిద్ర నాణ్యత, నిద్రా సామర్థ్యం, త్వరగా నిద్రలోకి జారుకోవడం వంటి వాటిలో మెరుగుదలలు ఉన్నట్లు వారు వెల్లడించడం ఈ అధ్యయనంలో అత్యంత ప్రోత్సాహకరమైన విషయం," అని అన్నారు.
 
"అంతేకాకుండా, అసంతృప్త కొవ్వులు, నిద్రకు సహకరించే సమ్మేళనాలు పుష్కలంగా ఉన్న ప్లాంట్-బేస్డ్ ఆహారాలు నిద్ర నాణ్యతకు మద్దతు ఇస్తాయని తాజా ఆధారాలు సూచిస్తున్నాయి. బాదంలో అసంతృప్త కొవ్వులతో పాటు దాని మొత్తం పోషక ప్రొఫైల్‌కు దోహదపడే ఇతర పోషకాలు కూడా ఉంటాయి. కండరాల సడలింపు, న్యూరోఎండోక్రిన్ నియంత్రణ ద్వారా నిద్రకు తోడ్పడే సూక్ష్మ పోషకాలు అయిన మెగ్నీషియం, పొటాషియం మరియు విటమిన్ ఇ బాదం ద్వారా అందుతాయి. ఆబ్జెక్టివ్ నిద్ర ప్రమాణాలపై ప్రభావాన్ని అర్థం చేసుకోవడానికి మరింత పరిశోధన అవసరం అయినప్పటికీ, రోజువారీ ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లలో బాదం పప్పులను ఒక సులభమైన, పోషక-సమృద్ధిగల ఆహారంగా చేర్చుకోవచ్చు."
 
సారాంశం
పోషకాహారానికి, నిద్రకు మధ్య ఉన్న సంబంధాన్ని అన్వేషించే విస్తృత ఆధారాలకు ఈ ఫలితాలు మరింత బలాన్ని ఇస్తున్నాయి. అదే సమయంలో వ్యక్తులు తాము పొందినట్లుగా చెప్పే నిద్ర నాణ్యతకు, మరియు నిద్ర శారీరక శాస్త్రాన్ని యంత్రాల ద్వారా కచ్చితంగా కొలవడానికి మధ్య ఉన్న వ్యత్యాసాన్ని గుర్తించాల్సిన ప్రాముఖ్యతను కూడా ఇవి నొక్కి చెబుతున్నాయి.
 
నిద్ర సరిగ్గా పట్టని పెద్దలు ఆరోగ్యకరమైన జీవనశైలిలో భాగంగా రోజూ బాదం తీసుకోవడం వల్ల వారి నిద్ర నాణ్యత మెరుగుపడుతుందన్నదే ఈ పరిశోధన ద్వారా తెలిసిన అతి ముఖ్యమైన విషయం. అయితే, ఆబ్జెక్టివ్ స్లీప్ ఫిజియాలజీపై బాదం వినియోగం యొక్క ప్రభావాలను నిర్ధారించడానికి మరియు ఈ ఫలితాల వెనుక ఉన్న మెకానిజమ్‌లను మరింత బాగా అర్థం చేసుకోవడానికి తదుపరి పరిశోధన అవసరం.
 
అధ్యయన వివరాలు:
ఈ అధ్యయనం నిద్రను రెండు విధాలుగా అంచనా వేసింది: మొదటిది, ఆమోదించబడిన స్వీయ-నివేదిత నిద్ర ప్రశ్నావళి ద్వారా. రెండవది, రాత్రిపూట పాలిసోమ్నోగ్రఫీ (PSG) ద్వారా. ఈ రెండవ పద్ధతి నిద్రను కచ్చితంగా కొలవడానికి అత్యంత ప్రామాణికమైనదిగా (గోల్డ్ స్టాండర్డ్) పరిగణించబడుతుంది.
About Writer
జయ
Content provider.... మరింత చదవండి
తర్వాతి కథనం
Lime Soda, నిమ్మకాయ సోడా తాగితే?