ఆమె అలా చేయగానే నా కాళ్లూచేతులు వణికాయి... నేను పనికిరానా?
నాతో పాటు చదివే అమ్మాయితో సాధారణంగా మాట్లాడే సమయంలో నాలో కోర్కెలు కలిగేవి. ఐతే వాటిని అదిమిపెట్టుకునేవాడిని. ఆమెతో స్నేహం చేస్తూ ఆమెను ప్రేమించేశాను. ఆ విషయం ఆమెతో చెబితే తనకు నాపట్ల ఎలాంటి ఫీలింగ్స్ కలగటంలేదని అంది. వెంటనే చేయి పట్టుకున్నా. ఆమె ఏదోలా అయిపోయి కొద్దిసేపటికే నన్ను హత్తుకుని కౌగలించుకుంది. ఆ తర్వాత కొన్నిరోజుల వరకూ కాలేజికి రావడం మానేసింది. నేను తప్పు చేశానా అని బాధపడ్డాను.
ఫోన్ చేసేందుకు ట్రై చేస్తే కట్ చేసేసింది. చివరికి బ్రతిమలాడుతూ మెసేజ్ పంపాను. రెండు రోజుల తర్వాత రిప్లై ఇచ్చింది. అందులో... తనకు నిత్యం నేను తాకిన స్పర్శే గుర్తుకు వస్తోందట. ఈ విషయం చెప్పి ఉద్వేగానికి లోనైంది. నేను సముదాయించాను. ఆ తర్వాత రోజు నుంచి నన్ను చూడనిదే వుండేది కాదు. మేమిద్దరం పెళ్లాడాలని నిర్ణయించుకున్నాం. ఐతే ఈమధ్య ఆమె నాకు చాలా దగ్గరగా వచ్చింది.
ఆమె నన్ను ఎక్కడెక్కడో తాకింది. ఎందుకో తెలియదు కానీ ఆమె అలా తాకగానే నాకు చమట్లు పట్టేశాయి. ఆమెను చూస్తేనే నాలో కోర్కెలు కలిగేవి... అలాంటిది ఆమె అలా తాకగానే నాకు భయంతో కాళ్లూ చేతులు వణికాయి. వళ్లంతా నీళ్లు పోసినట్లు చల్లబడిపోయింది. ప్యాంటూ చొక్కా తడిసిపోయాయి. నన్నలా చూసిన ఆమె టెన్షన్ అయింది.
ఏమైంది నీకూ... అంటూ దగ్గరకు తీసుకుని మళ్లీ కౌగలించుకుంది. దాంతో నాలో కోర్కెలు కలగాల్సింది పోయి మెత్తబడిపోయా. కాళ్లు చేతులూ వణుకుడు తగ్గలేదు సరికదా ఇంకాస్త పెరిగాయి. నాకిప్పుడు ఓ భయం పట్టుకుంది. నేను శృంగారానికి పనికిరానేమోనని. నాకేమైనా జబ్బు వున్నదేమోనని. రేపు పెళ్లాడితే నేను అందుకు పనికిరాకపోతే ఆమెకు ద్రోహం చేసినట్లవుతుందని ఆందోళనగా వుంది. ఆమె అలా కౌగలించుకుంటే నేను ఎందుకలా నీరుగారిపోయాను?
ఇలాంటి సమస్య చాలామంది యువకుల్లో ఉంటుంది. ప్రేమికుల్లో శృంగారం పట్ల దాగి ఉన్న భయమే దీనికి కారణమవుతుంది. స్పర్శలను దాటి ఆవలకు వెళ్లేసరికి తెలియని భయం చోటుచేసుకుంది. అందువల్లనే అలా కాళ్లూచేతులు వణికి ప్యాంటూచొక్కా తడిసిపోయాయి. అంతకుముందు మీలో స్పందనలు కలిగాయి కాబట్టి దాని గురించి చింతించాల్సిన పనిలేదు. ఇలాంటివన్నీ పక్కనపెట్టి పెద్దలతో చెప్పి పెళ్లి చేసుకోండి.