సోమవారం, 27 జనవరి 2025
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. చిట్కాలు
Written By సిహెచ్
Last Modified: గురువారం, 22 ఆగస్టు 2019 (20:35 IST)

నువ్వుల నూనెతో అలా మర్దనా చేసి...

అందం, ఆరోగ్యం విషయంలో నువ్వుల నూనెది కీలక పాత్ర. దీనిలోని విటమిన్స్, మినరల్స్ చిన్నారుల దేహాన్ని పుష్టిగా ఉంచుతాయి. ఈ నూనెలో విటమిన్-ఇ పుష్కలంగా లభిస్తుంది. దీంట్లో యాంటీ యాక్సిడెంట్లు చిన్నారుల్లో కొవ్వు స్థాయిని నియంత్రణలో ఉంచుతుంది. మెగ్నీషియం, కాపర్, కాల్షియం, జింక్, ఐరన్, విటమిన్ బి36 ఇందులో సమృద్ధిగా ఉంటాయి. 
 
స్నానానికి ముందు పసిపిల్లల మాడుకు, శరీరానికి నువ్వులనూనెతో మర్దనా చేస్తే హాయిగా నిద్రపోతారు. ఈ నూనె చిన్నారుల్లో మెదడు ఎదుగుదలకు బాగా తోడ్పడుతుంది. వెన్నెముక, కండరాలు బలపడేందుకు సహాయకారిగా ఉంటుంది. స్నానానికి ముందు నువ్వుల నూనెతో ఒళ్లంతా రుద్ది స్నానం చేయిస్తే పిల్లల చర్మం ప్రకాశవంతంగా తయారవుతుంది.