గురువారం, 23 జనవరి 2025
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. దాంపత్యం
Written By సిహెచ్
Last Updated : గురువారం, 8 ఆగస్టు 2019 (22:35 IST)

శృంగారంలో ఎక్కువసేపు పాల్గొనే శక్తిని రెట్టింపు చేయాలంటే...?

ప్రస్తుత కాలంలో వాతావరణ కాలుష్యం, మారిన  ఆహారపు అలవాట్లు వలన ఎక్కువ మంది దంపతులలో శృంగారపరమైన సమస్యలు తలెత్తుత్తున్నాయి. ముఖ్యంగా పిల్లలు పుట్టకపోవడం ఎక్కువగా కనిపిస్తుంది. వీటిని తగ్గించుకోవాలనుకుంటే ఏం చేయాలో చూద్దాం.
 
1. యాలుకలు శృంగారంలో ఎక్కువసేపు పాల్గొనే శక్తిని రెట్టింపు చేసి, మూడ్‌ని పెంచుతాయి. వాటి సువాసన ఒత్తిడిని దూరం చేస్తుంది. శృంగార సమస్యలు ఉన్నవారు యాలుకలను తీసుకోవాలని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు.
 
2. యాలకుల్లో విటమిన్ ఎ, బి, సి, రైబో ఫ్లేవిన్, మినరల్స్ పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీరంలోని విషపదార్థాలను తొలగించడంతో పాటు రక్తాన్ని శుద్ధి చేయడానికి సహాయపడతాయి.
 
3. యాలకుల గింజలను చప్పరిస్తూ ఉండటం వల్ల నోట్లో కొన్ని ద్రవాలు ఉత్పత్తి అవుతాయి. ఆకలి తక్కువగా ఉన్నవారు యాలకులను చప్పరిస్తూ ఉంటే ఆకలి బాగా పెరుగుతుంది. అంతేకాకుండా నోట్లో అలర్జీలు, ఇన్ఫెక్షన్లను తగ్గించడానికి సహకరిస్తాయి.
 
4. యాలకుల్లో విటమిన్స్, యాంటీ ఆక్సిడెంట్స్ శరీరానికి కావాల్సిన మోతాదులో అందించి.. శరీరంలోని ప్రీరాడికల్స్‌ని నాశనం చేస్తాయి.
 
5. యాలుకలు మన శరీరంలోని చెడు కొలస్ట్రాల్‌ని కరిగిస్తాయి. ప్రతిరోజు రాత్రిపూట ఒక యాలుకను తినడం వలన బరువు తగ్గుతాము. అంతేకాకుండా ఇవి శరీరంలోని వ్యర్దాలు, హానికర బ్యాక్టీరియా వంటి వాటిని తొలగిస్తాయి.  
 
6. మగవారిలో వీర్యకణాలు సరిగా లేకపోవడం వలన సంతాన సమస్యలు తలెత్తుతాయి. ఇందుకు యాలుకలను రోజుకు రెండు చొప్పున తీసుకుంటే వీర్యకణాలు వృద్ధి చెందుతాయి. అంతేకాకుండా నపుంసకత్వం లాంటి లైంగిక సమస్యలు దూరమవుతాయి.