శనివారం, 11 జనవరి 2025
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By సిహెచ్
Last Modified: శనివారం, 27 జులై 2019 (21:59 IST)

చద్దన్నంతో ఆరోగ్య ప్రయోజనాలు... ఏంటి?

పెద్దలు మాట చద్దన్నం మూట అంటారు. ఇటీవల కాలంలో చద్దన్నం తింటే అనారోగ్యమని చాలామంది భావిస్తున్నారు. కానీ.. చద్దన్నం వలన అనేక రకములైన ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. అన్నం పులవడం వల్ల పెరిగే పోషకాలు ఎన్నో. వాటి వలన ఉపయోగాలేమిటో చూద్దాం.
 
1. శరీరంలో వేడి ఎక్కువగా ఉన్నవారు చద్దన్నంలో పెరుగు, పచ్చిమిర్చి, ఉల్లిపాయ వేసుకుని తింటే ఆ వేడి తగ్గుతుంది.
 
2. యాబై గ్రాముల అన్నంను తీసుకుని రాత్రి పులియబెట్టినట్లయితే 1.6 మిల్లీ గ్రాములు ఉన్న ఐరన్ 35 మిల్లీ గ్రాములుగా పెరుగుతుంది. అలాగే పొటాషియం మరియు కాల్షియంలు కూడా ఎక్కువ మొత్తంలో పెరుగుతాయి అని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
 
3. చద్దన్నం తినడం వలన రోగనిరోధక శక్తి పెరుగుతుంది. పేగుల్లో ఉండే అనారోగ్య సమస్యలను సైతం ఈ చద్దన్నం తగ్గిస్తుంది.
 
4. ఎక్కువ సమయం ఉల్లాసంగా గడపాలంటే ఉదయాన్నే చద్దన్నం తినాల్సిందే.. అంతేకాకుండా పలు చర్మ వ్యాధుల నుండి చద్దన్నం కాపాడుతుందని తేలింది.
 
5. పేగుల్లో ఉండే అనారోగ్య సమస్యలను సైతం చద్దన్నం తగ్గిస్తుంది.