వానాకాలంలో మునగ గింజలను తీసి దంచి పొడి చేసి అలా తీసుకుంటే?

సిహెచ్| Last Modified శుక్రవారం, 19 జులై 2019 (18:01 IST)
నీళ్లలోని హానికారక బ్యాక్టీరియాలను మునగ గింజల పొడి నాశనం చేస్తుందని శాస్త్రవేత్తలు గుర్తించారు. ఇక మునగలో ఉండే మొరింగా ఓలీఫెరా కాటియోనిక్‌ ప్రొటీన్‌ (ఎంవోసీపీ) నీటిని శుద్ధిచేస్తుంది. మునగ గింజల పొడిని నీటిలో కలిపితే.. నీటిలోని ఘనపదార్థాలతో పాటు అడుగుభాగానికి చేరిపోతుంది. తద్వారా నీటిని ఆ ప్రొటీన్‌ శుద్ధి చేస్తుంది. దాదాపు 90-99 శాతం వరకు బ్యాక్టీరియా అంతు చూస్తుంది.

కానీ, నీళ్లలో మాత్రం కొన్ని మూలకాలు.. సేంద్రియ పదార్థాలుంటాయి కాబట్టి.. అది చనిపోని బ్యాక్టీరియాకు ఆహారంగా మారి మళ్లీ బ్యాక్టీరియా వృద్ధిచెందే ప్రమాదం ఉంటుంది. కాబట్టి ఎంవోసీపీని ఇసుకతో కలిపి నీటిని శుద్ధిచేస్తే.. ఆ సేంద్రియ పదార్థాన్ని సులభంగా తీసేయొచ్చంటున్నారు పరిశోధకులు. కాగా, పూర్వం ఈజిప్షియన్లూ మునగ విత్తనాల పొడిని కుండల లోపల రాసేవాళ్లు.

అయితే అన్ని కాలాల్లో లభించే మునగకాయల గింజలు అందుకు అనువుగా ఉండవట. వర్షాకాలంలో కాసిన మునగకాయల్లోని గింజలైతే సమర్థంగా పనిచేస్తాయని పరిశోధకులు చెబుతున్నారు. వానాకాలపు గింజలను సేకరించి, వాటిని పొడి చేసి ఏ కాలంలోనైనా ఉపయోగించుకోవచ్చని సూచిస్తున్నారు. అంతేకాదు.. మునగ గింజలే కాదు.. మునగ ఆకుకూ క్రిములను చంపే శక్తి ఉందని చెబుతున్నారు.దీనిపై మరింత చదవండి :